ఇండియా ఎంత‌గా డిటిజ‌ల్ అయిందో తెలియ‌డానికి ఈ వీడియోనే సాక్ష్యం

కాలం మారుతోంది.కాలానికి త‌గ్గ‌ట్టు టెక్నాల‌జీ కూడా పూర్తిగా మారిపోతోంది.

ఇక ఇండియా లాంటి డెవ‌ల‌ప్ అవుతున్న దేశాల్లో అయితే రోజు రోజుకూ టెక్నాల‌జీ కొత్త పుంత‌లు తొక్కుతోంది.

ఇక పేమెంట్ల విష‌యంలో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇంత‌కు ముందు మొత్తం నోట్ల రూపంలో చెల్లింపులు జ‌రిగితే ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే చెల్లిస్తున్నారు చాలామంది అంటే చిన్న కూర‌గాయ‌ల బండి ద‌గ్గ‌రి నుంచి స్టార్ హోట‌ళ్ల దాకా అంద‌రూ ఇలాంటి డిజిటల్ చెల్లింపులనే న‌మ్ముకుంటున్నారు. రూ.10 అయినా స‌రే ఆన్ లైన్ లోనే చెల్లిస్తున్నారు.పానీపూరీ లాంటి రోడ్ సైడ్ బిజినెస్ ల‌లో ఇలాంటివి విప‌రీతంగా పెరిగిపోయాయి.

ఫోన్ పే, గూగుల్ పే లేదంటే పేటీఎమ్ లాంటి ఎన్నో ర‌కాల ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత వీటి వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోయాయి.అయితే ప్ర‌జ‌లు కూడా వీటిని ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు ఎక్కువ‌గా న‌మ్ముతున్నారు.

Advertisement

ఈ కార‌ణంగా దేశంలో లావాదేవీలు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.కాగా ఇప్పుడు దేశంలో ఎంత‌లా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయో తెలిపే వీడియో ఒక‌టి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది.

పైగా ఈ వీడియోను కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెట్టింట పోస్టు చేసి డిజిట‌ల్ లావాదేవీల్లో దేశం ఎంత‌లా డెవ‌ల‌ప్ అయిందో తెలిపే వీడియో అంటేచెప్పేశారు.అయితే ఈ వీడియోలో గంగిరెద్దును తోలుకుని ఇండ్ల ద‌గ్గ‌ర భిక్షాట‌న చేసే వ్య‌క్తి ఓ ఐడియా వేశాడు.

ఆ గంగిరెద్దు త‌ల‌పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆన్ లైన్ లో డ‌బ్బులు వేయాలంటూ చెబుతున్నాడు.దీని ఉద్దేశం డిజిటల్ పేమెంట్స్ ను జానపద కళాకారులు కూడా వివ్వ‌సిస్తున్నార‌ని కేంద్ర‌మంత్రి చెప్పార‌న్న‌మాట‌.

ఈ వీడియో ఇప్పుడు కొద్ది నిముషాల్లోనే ట్రెండింగ్ లోకి వ‌చ్చేసింది.

ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు