ఈ గింజలను రోజుకు ఒక స్పూన్ చొప్పున తింటే రక్తహీనత వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంది!

మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో సీడ్స్ ఒకటి.సీడ్స్ అంటే ఎన్నో రకాలు ఉన్నాయి.

ముఖ్యంగా అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, చియా గింజలు.ఇవే మనకు ఎక్కువగా తెలుసు.

వీటినే మనం అధికంగా వాడుతుంటాం.కానీ అద్భుతమైన సీడ్స్ లో హలీమ్ సీడ్స్( Halim Seeds ) కూడా ఉన్నాయి.

ఎరుపు రంగులో ఉండే హలీమ్ సీడ్స్ చూడటానికి చిన్నగా కనిపించినా.విటమిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఈ, ఐర‌న్‌, ఫోలేట్, ఫైబర్, కాల్షియం మరియు ప్రోటీన్ వంటి పోషకాలకు పవర్‌ హౌస్ గా పేరుగాంచాయి.

Advertisement

ఈ హలీమ్‌ సీడ్స్ రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే రక్తహీనత వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంది.అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

హలీం సీడ్స్( Halim Seeds ) లో ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది.అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

దాంతో రక్తహీనత దూరం అవుతుంది.

అలాగే హలీం సీడ్స్ ను రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల వెయిట్ లాస్( Weight loss ) అవుతారు.ఎందుకంటే హలీమ్‌ గింజల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.అందువల్ల హలీమ్ సీడ్స్ ను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

చిరు తిండ్ల పై మనసు మళ్లకుండా చేస్తాయి.వెయిట్‌ లాస్ కు తోడ్పడతాయి.

Advertisement

అంతేకాదు హలీమ్‌ గింజలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డెలివరీ అనంతరం మహిళల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.నెలసరి సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.మలబద్ధకం సమస్య ( Constipation problem )నుంచి విముక్తి ల‌భిస్తుంది.

మరియు రోగనిరోధక వ్యవస్థ సైతం బ‌ల‌ప‌డుతుంది.ఇక హ‌లీమ్‌ విత్తనాలను ఎలా తీసుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.

వీటిని వాటర్ లో నానబెట్టి తీసుకోవాలి.నానబెట్టిన హలీమ్‌ సీడ్స్ ను పాలు, ఫ్రూట్ జ్యూసులు, స్మూతీలు, సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు లేదా నేరుగా కూడా తీసుకోవచ్చు.

తాజా వార్తలు