ఈ పనిమనిషి మనకెంతో నచ్చిన ఆ దర్శకుడి భార్య అని మీకు తెలుసా..?

2016లో వచ్చిన సైరాత్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఓ సెన్సేషన్ క్రీయేట్ చేసింది.దేశం మొత్తం ఒక్కసారిగా ఈ చిత్రం గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

అయితే ఈ సినిమా పేరుకి మరాఠీ సినిమా అయినాగానీ దేశ ప్రజల అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.బాష అర్ధం కాకపోయినా భావం అర్ధం చేసుకుని ప్రజలు అందరిని కంట తడి పెట్టించింది.

అంతేకాకుండా ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా బాగానే రాబట్టింది.మ‌రాఠీలో వ‌చ్చిన ఈ చిత్రం 4 కోట్ల‌తో తెర‌కెక్కి 100 కోట్ల‌కు పైగానే క‌లెక్ట్ చేసిందటె అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా గొప్పతనం గురించి.

అయితే ఇదే సినిమాను శ్రీ‌దేవి పెద్ద కూతురు ఝాన్వీక‌పూర్‌తో "ధడక్‌"గా రీమేక్ చేసారు.ఈ సినిమా రీమేక్ తోనే అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.

Advertisement
This Maid Lady Is The Wife Of Sairat Movie Director Nagraj Manjule, Wife, Tortur

ఈ సినిమాలో ముఖ్యంగా దేశంలో జరుగుతున్న పరువు హత్యలను ఒళ్ళు జలదరించేలా చూపించాడు నాగరాజ్ మంజులే.ఈ సినిమాతో ఒక్కసారిగా నాగరాజ్ మంజులే బాగా పాపులర్ అయిపోయాడు.

This Maid Lady Is The Wife Of Sairat Movie Director Nagraj Manjule, Wife, Tortur

అయితే తన సినిమాలో మహిళల సమస్యల గురించి ఎంతో బావోద్వేగంగా చూపించే నాగరాజ్ తన సొంత భార్య విషయంలో మాత్రం రాక్షసుడిలా ప్రవర్తించాడని తన భార్యే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.నాగరాజ్ తన భార్యని మానసికంగా, శారీరికంగా చిత్ర హింసలు పెట్టారని అతడి భార్య విమర్శలు చేసారు.సునీతకి 18 ఏళ్లకే నాగరాజ్‌తో త‌న‌కు పెళ్లైందని చెప్పుకొచ్చారు.

అలాగే ఆ సమయంలో నాగరాజ్ సినిమా దర్శకుడు అయ్యేందుకు కష్టపడుతూ ఉండేవాడు.ఒక పక్క దర్శకుడిగా చేస్తూనే మరోపక్క చదువుకుంటూ ఉండేవాడట.

దాంతో చదువుల నిమిత్తం వేరే నగరానికి వెళ్లి చదుకోవడంతో కుటుంభ భారం మొత్తం సునీత మీద పడ్డాయి.ఎందుకంటే సునీత ఆ ఇంటి పెద్దకోడలు అవ్వడం వలన కుటుంబ బాధ్యతలు చేపట్టింది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

ఎన్ని కష్టాలు వచ్చినాగాని కుటుంభ బాధ్యతలని మాత్రం విస్మరించలేదు.ఎందుకంటే నాగరాజ్ అంటే సునీతకి అంత ప్రేమ, గౌరవం కాబట్టి.

Advertisement

కుటుంబంలో చాలా సమస్యలు వచ్చినా నాగరాజ్ మీద ప్రేమతో అవన్నీ తాను భరించినట్లు సునీత చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఆ మధ్య కాలంలో నాగరాజ్ మంజులే దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ‘పిస్తుల్యాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఆ అవార్డు అందుకోవడానికి ఫ్యామిలీ మొత్తం ఢిల్లీ వెళ్లారట కానీ సునీతని మాత్రం తీసుకుని వెళ్లకుండా, గదిలో ఉంచి తాళం వేశారు అని సునీత వాపోయారు.ఆ రోజు సునీత ఎంతో ఏడిచారట.

తరువాత కూడా నాగరాజ్ ప్రవర్తనలో మార్పు రాలేదు.సరాసరి నేరుగా ఇంటికి అమ్మాయిలను తీసుకొచ్చేవాడు.

ఇంటికి తీసుకుని వచ్చిన అమ్మాయిలకు స్వయంగా సునీతే వంట వండి పెడుతూ సేవలు చేసేదట.సాధారణ గృహిణి కావడంతో ఇంతకన్నా ఏమి చేయగలను అనే అమాయకత్వంలో సునీత ఉండిపోయింది.

అంతేకాకుండా మరీ దారుణంగా సునీతకి గర్భం వస్తే అతడి సినిమాలకు అడ్డంకిగా ఉంటుందని అబార్షన్ చేయించుకోమని హింసించే వాడని సునీత చెప్పుకొచ్చారు.రెండు మూడు సార్లు నాగరాజ్ వలన బిడ్డలను కూడా పోగొట్టుకున్నది.

అలా ప్రతిసారి బిడ్డను పోగొట్టుకోలేక ఎదురు తిరిగిందట.ఎదురు మాట్లాడాను అని నన్ను కొట్టి చిత్ర హింసలకు గురిచేసేవాడు అని అన్నారు.ఇంకా నాగరాజ్ పెట్టే బాధలు భరించలేక, ఈ హింసాత్మాక కాపురం చేయలేక తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిందట.2012లో నాగరాజ్ తో విడిపోవడానికి నిర్ణయించుకుని కోర్టులో విడాకులు కోసం అప్లై చేయగా 2014లో ఇద్దరికీ చట్ట ప్రకారం విడాకులు మంజూరు అయ్యాయి.అంతే కాకుండా విడాకుల సమయంలో 7 లక్షల రూపాయలను భరణం కింద ఇచ్చారని తెలిపింది సునీత.

ఇప్పుడు బతుకడానికి ఎదో ఒకటి చేయాలి కదా తాను కొందరి ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవనాన్ని గడుపుతున్నట్లు వెల్లడించారు.నిజంగా సునీత జీవితంలో జరిగిన దారుణమైన ఘటనలు తలచుకుంటే ఎవరికయినా అయ్యో పాపం అని అనిపిస్తుంది కదా.!! ఇలాంటి మహిళలు పడుతున్న బాధలను సినిమా రూపంలో చూపించే నాగరాజ్.నిజ జీవితంలో మాత్రం కట్టుకున్న భార్య పట్ల ఇంత కఠినంగా ఎలా ప్రవర్తించాడో అర్ధంకాని ప్రశ్నలా మిగిలిపోయింది.

తాజా వార్తలు