ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలను మించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఫుల్ రన్ లో ఈ సినిమా 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సినిమా ఆ రికార్డును అందుకుంటుందో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ మూవీ సెకండ్ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుందని ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ పాత్రకు జక్కన్న ఎ.ఎస్.రామరాజు అని ఎన్టీఆర్ పాత్రకు భీమ్ అని పేర్లు పెట్టాడనే సంగతి తెలిసిందే.ఈ పాత్రల్లో చరణ్, తారక్ అద్భుతంగా నటించారు.అయితే విజయేంద్ర ప్రసాద్ కు ఒక ఇంటర్వ్యూలో పవన్ రాజమౌళి కాంబో గురించి ప్రశ్న ఎదురైంది.ఆ ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ సమయం సందర్భం రావాలని పవన్ తో మల్టీస్టారర్ చేయాలంటే ఆయన స్థాయి స్టార్ ఎవరూ లేరని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ ఉగాది పండుగ కూడా ఊహించని విధంగా కలిసొచ్చిందని తెలుస్తోంది.ఈ వారం సినిమాను చూడాలని అనుకునే ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రమే బెస్ట్ ఆప్షన్ గా నిలవనుందని చెప్పవచ్చు.భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమా సత్తా చాటుతోంది.

ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.రాజమౌళి తర్వాత మూవీ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుంది.ఈ సినిమాకు 800 కోట్ల రూపాయల బడ్జెట్ అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
అయితే మహేష్ రాజమౌళి కాంబో మూవీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుంది.ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.