పవన్ తో రాజమౌళి మల్టీస్టారర్ చేయడానికి సమస్య ఇదే.. ధీటైన స్టార్ లేడంటూ?
TeluguStop.com
ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలను మించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఫుల్ రన్ లో ఈ సినిమా 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సినిమా ఆ రికార్డును అందుకుంటుందో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ మూవీ సెకండ్ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుందని ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ పాత్రకు జక్కన్న ఎ.ఎస్.
రామరాజు అని ఎన్టీఆర్ పాత్రకు భీమ్ అని పేర్లు పెట్టాడనే సంగతి తెలిసిందే.
ఈ పాత్రల్లో చరణ్, తారక్ అద్భుతంగా నటించారు.అయితే విజయేంద్ర ప్రసాద్ కు ఒక ఇంటర్వ్యూలో పవన్ రాజమౌళి కాంబో గురించి ప్రశ్న ఎదురైంది.
ఆ ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ సమయం సందర్భం రావాలని పవన్ తో మల్టీస్టారర్ చేయాలంటే ఆయన స్థాయి స్టార్ ఎవరూ లేరని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
"""/"/
ఆర్ఆర్ఆర్ మూవీ ఉగాది పండుగ కూడా ఊహించని విధంగా కలిసొచ్చిందని తెలుస్తోంది.
ఈ వారం సినిమాను చూడాలని అనుకునే ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రమే బెస్ట్ ఆప్షన్ గా నిలవనుందని చెప్పవచ్చు.
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమా సత్తా చాటుతోంది. """/"/
ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.రాజమౌళి తర్వాత మూవీ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుంది.
ఈ సినిమాకు 800 కోట్ల రూపాయల బడ్జెట్ అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
అయితే మహేష్ రాజమౌళి కాంబో మూవీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుంది.ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.