ఇదేం స‌ర‌దా.. జేసీబీ మీద పెండ్లి మంట‌పానికి వ‌చ్చిన జంట‌

ఒక్కో వ్య‌క్తి ఒక్కోలా ఆలోచిస్తుంటారు.ఈ సృష్టిలో పుర్రెకో బుద్ధి ఉంటుంద‌నే సామెత చాలా సార్లు నిరూపిత‌మైంది.

ఎందుకంటే అంద‌రూ చేసిన‌ట్టు చేస్తే మ‌జా ఏముంటుంది క‌దా.అందుకే చాలామంది ఇలాగే ఆలోచించి చాలా డిఫ‌రెంట్‌గా ఏదైనా చేసి ఫేమ‌స్ కావాల‌నుకుంటున్నారు.

ఇక సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిన త‌ర్వాత ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌నం చాలానే చూస్తున్నాం.ఇక పెండ్లిలోనే ఇలాంటి విచిత్ర‌మైన ఘ‌ట‌న‌లు మ‌న‌కు చాలా క‌నిపిస్తుంటాయి.

ఎందుకంటే పెండ్లి అనేది జీవితంలో ఒకేసారి వ‌చ్చేది కాబ‌ట్టి కొంచెం గుర్తుండేలా చేసుకోవాల‌ని అంతా అనుకుంటారు.అందుకే చాలామంది పెండ్లిలో ఏదో ఒక డిఫ‌రెంట్ ప‌నిచేస్తుంటారు.

Advertisement

ఇక ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే విష‌యంలో కూడా ఓ జంట ఇలాగే చిత్ర విచిత్రంగా ఆలోచించింది.తాము అంద‌రిలోకెల్లా డిఫ‌రెంట్ గా పెండ్లి చేసుకోవాల‌ని ప్లాన్ చేసింది.

పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ యువ జంట పెండ్లికి రెడీ అయిపోయింది.ఇక మంట‌పానికి కారులో వెళ్తే మ‌జా ఉండ‌ద‌ని ఏకంగా జేసీబీ‎పై చేరుకుని అందరినీ షాక్‌కు గురి చేసింది.

జేసీబీ ముందు ఉండే బకెట్ మీద నిలబడి మ‌రీ పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు ఇలా రావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఇక వీరు ఇలా జేసీబీ‎ బకెట్ మీద నిల్చుని వ‌చ్చేందుకు వీలుగా రెండు సోఫా సీట్లు కూడా అరేంజ్ చేయ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.పెండ్లికి వ‌చ్చిన బంధువులు కూడా వారిని ఎంరేజ్ చేసి హర్షధ్వానాలతో ఆహ్వానించారుఉ.ఈ విచిత్ర‌మైన పెండ్లి వేడుకు గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియాలో జరిగింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

వీరు చేసిన ఈ పనిని వీడియో తీసి నెట్టింట వ‌ద‌ల‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.అంద‌రూ వారి ప్ర‌య‌త్నంపై త‌మ అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు.

Advertisement

కొంద‌రు పాజిటివ్‌గా తీసుకుంటే మ‌రి కొంద‌రు మాత్రం ఇలాంటివి అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు