పెద్దవారి పాదాలకు నమస్కరించేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి!

మన సనాతన సంప్రదాయాల ప్రకారం పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం అనేది మన సాంప్రదాయాలలో ఒక భాగం అయ్యింది.

ఇలా తల్లిదండ్రులు గురువులు మన పెద్దవారికి పాదాభివందనాలు చేస్తూ వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల వారిపై ఉన్న భక్తి భావాన్ని వెల్లడించడమే కాకుండా వారి ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల ఎల్లప్పుడు సంతోషంగా ఉంటామని పెద్దలు చెబుతుంటారు.

ఈ విధంగా పాదాలకు నమస్కారం చేసే సమయంలో  కొన్ని నియమాలను పాటించాలని పెద్దలు చెబుతుంటారు.మరి పాదాలకు నమస్కరించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఒక వ్యక్తి పాదాలను తాకడం వెనుక మనం అతనికి ఎంత గౌరవం ఇస్తున్నామో తెలిపే విషయమే కాకుండా అది ఒక సాంప్రదాయమని చెప్పవచ్చు.మరి ఈ సాంప్రదాయం ప్రకారం పాదాలకు నమస్కరించే సమయంలో మీ ఎడమ చేతిని ఎడమ కాలి పై, కుడి చేతిని కుడి కాలి పై ఉంచి నమస్కరించాలి.

These-rules Are Mandatory When Your Taking Blessings Blessings, Rules, Mandatory

అలాగే మరికొందరు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే మన తలను రెండు చేతుల మధ్య ఉంచి వారి పాదాలకు నమస్కారం చేయాలి.సాధారణంగా పెద్ద వారి పాదాలను మాత్రమే నమస్కరించాలని చిన్న వారి పాదాలను తాకడం వల్ల వారికి ఆయుష్షు క్షీణించిపోతుందని చెబుతారు.

Advertisement
These-rules Are Mandatory When Your Taking Blessings Blessings, Rules, Mandatory

కానీ పెద్దవారికి మాత్రమే కాకుండా చిన్న వారి పాదాలను కూడా నమస్కరించవచ్చని పెద్దల పాదాలను తాకడం ద్వారా నవగ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు