అలాంటి వారు బాదం తింటే రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే..జాగ్ర‌త్త‌!

న‌ట్స్‌లో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాదం ప‌ప్పును.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తింటుంటారు.

ముఖ్యంగా ఉద‌యాన్నే నాన బెట్టి బాదం ప‌ప్పును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తుంటారు.ఎందుకంటే, బాదం ప‌ప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఐర‌న్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్, కార్బోహైడ్రేట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా అనేక పోష‌కాల‌ను కూడా క‌లిగి ఉంటుంది.అందుకే బాదం ప‌ప్పును రెగ్యుల‌ర్‌గా తీసుకోమ‌ని చెబుతుంటారు.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.కొంద‌రు మాత్రం బాదం ప‌ప్పును దూరం పెట్టాల్సిందే.

Advertisement

మ‌రి ఆ కొంద‌రు ఎవ‌రో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.మూత్ర‌పిండాల్లో రాళ్లు ఉన్న వారు ఖ‌చ్చితంగా బాదం ప‌ప్పును ఎవైడ్ చేయాలి.

బాదం ప‌ప్పులో ఆక్సలేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి.ఇవి మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను మ‌రింత‌గా పెంచేస్తాయి.

అందుకే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారు బాదం ప‌ప్పును తీసుకోరాద‌ని నిపుణులు చెబుతున్నారు.

అలాగే జీర్ణ వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉన్న వారు కూడా బాదం ప‌ప్పును తిన‌రాదు.ఇలాంటి వారు బాదంను డైట్‌లో చేర్చుకుంటే.మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌ర‌చూ ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

త‌ర‌చూ త‌ల‌నొప్పితో ఇబ్బంది ప‌డే వారు బాదం ప‌ప్పును తీసుకుంటే రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే.బాదం ప‌ప్పులో ఉండే విట‌మిన్ ఇ త‌ల‌నొప్పి మ‌రింతగా పెంచేస్తుంది.మ‌రియు తీవ్ర అల‌స‌ట‌కు కూడా గురి చేస్తుంది.

Advertisement

ఇక బాదం ప‌ప్పు బ‌రువు త‌గ్గిస్తుంద‌న్న విష‌యం తెలిసిందే.అలా అని అధికంగా వీటిని తీసుకుంటే మాత్రం.బ‌రువు త‌గ్గ‌డం కాదు పెరుగుతారు.

ముఖ్యంగా అధిక బ‌రువు ఉన్న వారు చాలా లిమిట్‌గా బాదంను తినాలి.ఎందుకంటే.

బాదంలో బోలెడ‌న్ని పోష‌కాల‌తో పాటు కేల‌రీలు, కొవ్వులు కూడా అధకంగానే ఉంటాయి.

తాజా వార్తలు