ముఖ చ‌ర్మం స్మూత్‌గా మారాలా? అయితే ఇవి ట్రై చేయండి!

ఎలాంటి మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు లేకుండా ముఖ చ‌ర్మం స్మూత్‌గా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో చాలా మందికి అది అసాధ్యం గానే మారింది.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో చోటు చేసుకున్న మార్పులు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం వంటి కార‌ణాల వ‌ల్ల ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.దాంతో ఆ స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించు కోవ‌డం కోసం నానా పాట్లు ప‌డు తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ ఫేస్ ప్యాకుల‌ను ట్రై చేస్తే గ‌నుక మీ ముఖ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ స్మూత్‌గా, కాంతి వంతంగా మెరుస్తుంది.మ‌రి లేటెందుకు ఆ ఫేస్ ప్యాకుల‌ను ఎలా త‌యారు చేసుకుని.ఏ విధంగా వాడాలో చూసేయండి.

ముందుగా కొన్ని చామంతి పూల‌ను తీసుకుని రేక‌ల‌ను మాత్రం వేరు చేసుకోవాలి.ఈ రేక‌ల‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి.

Advertisement

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో చామంతి రేక‌లు, రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ వేసి మెత్త‌టి పేస్ట్‌లా మిక్సీ  చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం వాట‌ర్‌తో ఫేస్ వాష్‌ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై మొటిమ‌లు, ముడ‌త‌లు ఉంటే తొల‌గిపోయి ముఖం స్మూత్‌గా మారుతుంది.

అలాగే మ‌రో ఫేస్ ప్యాక్ కోసం.మిక్సీ జార్‌లో గుప్పెడు లేత గులాబీ రేక‌లు, కొద్దిగా వాట‌ర్ పోసి పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల గులాబీ పేస్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌చ్చి పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి ముఖానికి ప‌ట్టించి.ఆరిన త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే ఫేస్ స్మూత్‌గా మారుతుంది.

Advertisement

మ‌రియు స్కిన్ టోన్ కూడా పెరుగుతుంది.

" autoplay>

తాజా వార్తలు