సాధారణంగా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు టాప్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్‌ను దాదాపు ప్రతి ఒక్కరూ చెక్ చేస్తారు.
అయితే ఇంతకుముందు వరకు టెక్ వెబ్‌సైట్స్‌ను ప్రజలు ఫాలో అయ్యేవారు.
కానీ ఇప్పుడు ఏఐ చాట్‌బాట్స్( AI chatbots ) అందుబాటులోకి రావడంతో వాటినే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఏవో లిఫ్ట్ చేయాలని అడుగుతున్నారు.కాగా తాజాగా 2023లో టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఏవో చెప్పాలని గూగుల్ ఒక నెటిజన్ అడిగారు.
దానికి గూగుల్ బార్డ్ అదిరిపోయే లిస్ట్ తయారుచేసింది.ఆ లిస్టులో నెంబర్ వన్ శామ్‌సంగ్ నిలవడం ఆసక్తికరంగా మారింది.1.శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా:
- గూగుల్ బర్డ్ పేర్కొన్న నెంబర్ వన్ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా( Samsung Galaxy S23 Ultra ).ఇది అధిక రిజల్యూషన్‌తో కూడిన పెద్ద 6.8-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది.- ఫోన్‌లో 200MP ప్రధాన కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
- ముందు 12MP కెమెరా ఇచ్చారు.ఇది శక్తివంతమైన క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.2.యాపిల్ ఐఫోన్ 14 ప్రో:
- ఇక సెకండ్ టాప్ స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ఐఫోన్ 14 ప్రోని గూగుల్ బర్డ్ లిస్ట్ చేసింది.ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, A16 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది.- ఇది 48MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.3.గూగుల్ పిక్సెల్ 7 ప్రో:
- ఇది ఆండ్రాయిడ్ 13లో నడుస్తుంది.12GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉంది.- డిస్‌ప్లే 6.7 అంగుళాలు ఉంటుంది.క్వాడ్ HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది.
- ఫోన్ 50MP + 48MP + 12MP రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.అలానే 10.8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.- ఇది గూగుల్ Tensor G2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.4926mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది. 4.వన్‌ప్లస్ 11:
- ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది.- ఇది సరికొత్త క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వర్క్ అవుతుంది.
- రియర్ కెమెరా సెటప్‌లో 50MP + 48MP + 32MP కెమెరా ఉంటుంది.ముందు 16MP కెమెరా ఉంటుంది. 5.శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4:
- ఇది 7.6-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.2-అంగుళాల సెకండరీ డిస్‌ప్లేతో వచ్చే ఒక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.- రియర్ కెమెరా సెటప్‌లో 50MP + 12MP + 10MP కెమెరాలు ఉన్నాయి.- ఇది వన్ UI 4.1తో ఆండ్రాయిడ్ 12Lలో రన్ అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy