వేసవిలో నువ్వులను సాగు చేస్తే ఆశించే చీడపీడలు ఇవే.. నివారణకు చర్యలు..!

నువ్వుల పంట( Sesame Cultivation )ను ఎక్కువగా వేసవిలో రెండవ పంటగా సాగు చేస్తారు.

నువ్వుల పంటకు చీడపీడల( Pests ) బెడద చాలా ఎక్కువ.

తొలి దశలోనే చీడపీడలను అరికడితే ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.నువ్వుల పంటను ఆశించే చీడపీడలు.

నివారణ కోసం చర్యలు ఏమిటో చూద్దాం.రసం పీల్చే పురుగులు: పంట విత్తిన 25 రోజులలోపు ఈ పురుగులు పంటను ఆశించడం వల్ల ఆకులు ముడుచుకుపోయి పాలిపోతాయి.తొలి దశలోనే ఒక లీటర్ నీటిలో 16 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ ను కలిపి పిచికారి చేయాలి.

లేదంటే 20 మిల్లీలీటర్ల డైమిథోయెట్ ను పిచికారి చేసి ఈ పురుగులను అరికట్టాలి.పేనుబంక ఆకునల్లి పురుగులు: పంట విత్తిన 20 రోజులలోపు ఈ పురుగులు లేత మొక్కలను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.60 మిల్లీలీటర్ల డైకోఫాల్( Dicofol ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Advertisement

గడ్డి చిలక పురుగులు: పంట విత్తిన 20 రోజులలోపు మొక్క మొదళ్ళ ను ఆశించడం వల్ల మొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది.ఈ గడ్డి చిలక నివారణకు పొలంలో జొన్న వేయడం తో పాటు పొలం గట్లు పరిశుభ్రంగా ఉంచాలి.ఒక లీటరు నీటిలో 20 మిల్లీలీటర్ల ప్రాఫినోఫాస్ ను కలిపి పిచికారి చేయాలి.

ఆకు గూడు పురుగులు: పంట మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలు, పువ్వులకు, కాయల్లోని తెల్ల గింజలను ఇవి ఆశిస్తాయి.దీంతో మొక్కలు వాడిపోయి ఎండిపోతాయి.

వీటి నివారణకు 20 మిల్లీలీటర్ల క్వినాల్ ఫాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

నువ్వుల పంట ( Sesame Cultivation )వేసే ముందు పొలంలో లోతు దుక్కులు దున్నుకోవాలి.అధిక ప్రాధాన్యం సేంద్రియ ఎరువులకే ఇవ్వాలి.సాధారణంగా నువ్వుల పంటను రెండవ పంటగా వేస్తారు కాబట్టి మొదటి పంటకు సంబంధించిన అవశేషాలు ఏమీ లేకుండా పొలాన్ని పరిశుభ్రం చేయాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వైరల్: సాక్స్‌లు లేకపోతే ఏం... ఇలా ఎపుడైనా ఆలోచించారా?

ఏవైనా చీడపీడలు ఆశిస్తే తొలి దశలోనే అరికట్టకపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది .

Advertisement

తాజా వార్తలు