ఈ 7 వస్తువులు వేరే వారు వాడకూడదు.. లేకుంటే వర్షాకాలంలో వ్యాధులు ఖాయం!

వర్షాకాలం( Monsoon ) వానలతో ఇంచుమించుగా దేశమంతటా కుమ్మేస్తోంది.

ఈ కాలంలో దగ్గు, జలుబు, చర్మం అలెర్జీలు, కంటి అలెర్జీ సమస్యలు వంటివి జనాలను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వుంటారు.

మరీ ముఖ్యంగా చిన్నపిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి.వాతావరణంలో అధిక తేమ వల్ల, చుట్టుపక్కల నీటి నిల్వల వల్ల బ్యాక్టీరియా, వైరస్లు అధికంగా పెరగడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.

అందుకే వానాకాలంలో వైరల్ వ్యాధులు( Viral Diseases ) వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు.

తుమ్ములు లేదా దగ్గు ద్వారా వ్యాప్తి చెందుతాయి.ముఖ్యంగా సాల్మొనెల్ల, నోరా వైరస్, షిగేల్లా, రోటా వైరస్, స్టాప్ వైరస్ వంటివి కూడా అనేక రోగాలకు కారణం అవుతాయి.

Advertisement
These 7 Personal Items Should Never Share With Anyone In Monsoon Details, Cough,

ఇవి ఒకరి నుంచి ఒకరికి చాలా తేలికగా వ్యాప్తి చెందుతాయి.

These 7 Personal Items Should Never Share With Anyone In Monsoon Details, Cough,

కాబట్టి వ్యక్తిగతమైన శ్రద్ధ చూపడం చాలా అవసరం.కుటుంబ సభ్యులైనప్పటికీ కొన్ని వస్తువులను వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి.వాటినే వేరే వాళ్ళతో అస్సలు షేర్ చేసుకోకూడదు.

అందులో ముఖ్యంగా మీ హేండ్ కర్చీఫ్ ను( Handkerchief ) ఎట్టి పరిస్థితులలోను ఇతరులతో పంచుకోవద్దు.ఎందుకంటే ఈ కర్చీఫ్ ఫై ఎన్నో రకాల బ్యాక్టీరియాలు చేరే అవకాశం ఉంది.

అదేవిధంగా టవల్( Towel ) కూడా వ్యక్తిగత వస్తువుగానే భావించాలి.చాలామంది ఇళ్లల్లో ఒకే టవల్ ని వాడేస్తూ వుంటారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

ముఖ్యంగా ఈ వానాకాలంలో అంత మంచిది కాదు.అదేవిధంగా ఒకరు వాడిన సబ్బుని( Soap ) వేరొకరు వాడకపోవడమే ఉత్తమం.

Advertisement

ఎందుకంటే చర్మంపై ఉండే బ్యాక్టీరియాను సబ్బు చాలా త్వరగా బదిలీ చేస్తుందనే విషయం మీకు తెలియంది కాదు.ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 62 శాతం బ్యాక్టరియాలు సబ్బుల వల్ల వ్యాప్తి చెందినవే.

ఇక పొరపాటున కూడా ఒకరి టూత్ బ్రష్( Tooth Brush ) మరొకరితో షేర్ చేయకూడదు.అలా చేస్తే దంత క్షయం వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.అదేవిధంగా దువ్వెనని( Comb ) కూడా వేరొకరితో షేర్ చేయకూడదు.

మన ఇళ్లలో చాలామంది ఒకే దువ్వెనని పదిమంది వాడుతూ వుంటారు.దీనివలన చుండ్రు, జుట్టు రాలడం, పేనుకొరుకుడు సమస్యలు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది.

అలాగే బాత్రూంలో ఉపయోగించే చెప్పులపై ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటాయి.వాటిని వేరే వారికి ఇవ్వడం గానీ, వేరే వారివి.

మీరు వాడడం గాని అస్సలు చేయకూడదు.ఇక చివరగా లిప్ బామ్స్ గురించి చెప్పుకోవాలి.

చాలామంది ఫ్రెండ్స్ ఒకరి నోటిలోది మరొకరు పెట్టుకుంటూ వుంటారు.అలా చేస్తే పెదవులపై ఉండే మృత కణాలు, సూక్ష్మ క్రిములు లిప్ బామ్పై చేరుతాయి.

వాటిని వేరే వాళ్ళు వాడటం వల్ల, వారికి కూడా ఈ సూక్ష్మక్రిములు అంటుకునే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్త మిత్రులారా!.

తాజా వార్తలు