ఆ వార్తల్లో నిజం లేదు: టీఎస్ డిప్యూటీ స్పీకర్

టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వస్తున్నట్లు వచ్చిన వార్తలు కేవలం పుకార్లేనని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారరు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.దీనిపై పద్మారావు క్లారిటీ ఇచ్చారు.

తాజాగా మంత్రి కేటీఆర్‌తో డిప్యూటీ స్పీకర్ పద్మారావు భేటీ అయ్యారు.ఈ సమావేశంలో పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలు స్పందించారు.

అలాగే ఇటీవల పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలపై చర్చినట్లు సమాచారం.అయితే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్‌తో భేటీ అయ్యారు.

Advertisement

దీంతో అప్పటి నుంచి చాలా మంది పద్మారావు బీజేపీకి చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.అయితే తాను టీఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్‌తో అనుసంబంధం కొనసాగుతోందన్నారు.అలాంటి పార్టీని వీడి వేరే పార్టీ కండువా కప్పుకోనని పేర్కొన్నారు.

అయితే పద్మారావు భేటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

ఇరువురూ రాజకీయ ప్రాధాన్యం కోసం భేటీ కాలేదని మంత్రి కిషన్‌రెడ్డి మీడియాలో ప్రకటించారు.మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రచారంలో పాల్గొననున్నారు.ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?

అలాగే మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ భారీ స్థాయిలో విరుచుకుపడ్డారు.వ్యక్తి ప్రయోజనం కోసం మునుగోడులో బీజేపీ రైతులను మభ్యపెడుతోందని కేటీఆర్ ఆరోపించారు.

Advertisement

ఏ పార్టీ గెలవాలో రైతుల చేతుల్లోనే ఉందని తెలిపారు.ప్రైవేటు పరం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? లేదా రైతులకు అండగా ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? మీరే తేల్చుకోవాలని పేర్కొన్నారు.

తాజా వార్తలు