టీడీపీ దొంగ ఓట్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం తమకు లేదన్నారు.
నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమమే వైసీపీని గెలిపిస్తుందని తెలిపారు.
చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అంబటి ఆరోపించారు.
ఇన్నాళ్లు దొంగ ఓట్లతో కుప్పంలో చంద్రబాబు గెలిచారని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తెలిపారు.
ఈ క్రమంలోనే జనసేనకు మళ్లీ గాజుగ్లాస్ సింబల్ ఎందుకని ప్రశ్నించారు.పవన్ సైకిల్ గుర్తుపై పోటీ చేయొచ్చు కదా అని ఎద్దేవా చేశారు.
మోసం చేయడంలో చంద్రబాబు దిట్టని పేర్కొన్నారు.కానీ ఈసీకి టీడీపీ, జనసేన ఫిర్యాదు చేసి తమను బద్నాం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.
ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామన్న మంత్రి అంబటి విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వైసీపీనే గెలుస్తుందని తెలిపారు.