ప్రస్తుతం రెండు వైరల్ వార్తల విషయానికి సంబంధించిన కథ కమీషు తెలుసుకుందాం అసలు విషయం ఏమిటి అంటే తమిళనాడు సూపర్ స్టార్ కపుల్ ఐన నయనతార, విగ్నేష్( Nayanthara, Vignesh ) గురించి మనకు తెలిసిందే.నయన్ ఈమధ్య ఓటీపీ అయిన నెట్ఫ్లిక్స్ లో అన్నపూర్ని అనే ఒక సినిమా కూడా చేసింది.
అయితే దీనిపై ఒక కేసు నమోదు అయింది.ఆ కేసు తాలూకా సారాంశం ఏమిటి అంటే ఈ చిత్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా క్లైమాక్స్ సన్నివేశాలు ఉన్నాయని, నటీనటులతో పాటు డైరెక్టర్ ప్రొడ్యూసర్ పై కూడా కేసు నమోదు చేశారు.
నిజంగా సినిమా చూసిన తర్వాత చాలామంది ఇదే రకమైన అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేశారు.

ఈ సినిమా ఏమైనా కమర్షియల్ గా నయన తారకు వర్కౌట్ అయ్యిందా అంటే అది లేదు.ఇలాంటి ఒక సినిమా చేయక పోయినా ఆమెకు వచ్చే నష్టం లేదు.డబ్బులు రాలేదు పైగా పేరు పోయింది.
పోయి పోయి నయన్ ఇంత స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా ఇలాంటి సినిమాలు చేసి పైగా అసంబద్ధ సమాచారం జనాలపై రుద్దే ప్రయత్నం చేయడం ఏమాత్రం సబబు కాదు అనే చెప్పుకోవాలి.ఏదో చేసింది అని అనుకుంటే ఆమె భర్త విగ్నేష్ శివన్ కూడా అదే దోవలో ప్రస్తుతం ఒక ఇష్యులో ఇరుక్కున్నాడు.
ఇతగాడు ఆ మధ్యలో ఏవో ఒకటో రెండో సినిమాలు చేశాడు కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.డైరెక్టర్ అనే టాగ్ ఉండాలి అంటే ఏదో ఒక సినిమా తీయాలి కాబట్టి ఎల్ఐసి అనే ఒక సినిమాను ప్రారంభించాడు.

ఈ పేరు తో తన సినిమా అనౌన్స్ చేయగానే సదరు ఎల్ఐసి సంస్థ( LIC Company ) ఈ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతే కాదు ఒక తమిళ డైరెక్టర్ టైటిల్ నాది అంటూ కూడా గొడవకు దిగాడు.ఈ టైటిల్ ఎవరు వాడుకున్న ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.జాతీయ స్థాయిలో ఉన్న ఒక సంస్థ పేరు ఇలా వాడుకోవడం కూడా నిజంగా కరెక్ట్ కాదు.
నయన్ దంపతులు చేసే సినిమాలకే ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయో అర్థం కాదు.వారిద్దరూ తమిళనాడులో ఈ సినిమాలు చేస్తున్నారు కాబట్టి సరిపోయింది అదే మన తెలుగులో చేసి ఉండి ఉంటే సజ్జనార్ లాంటి వ్యక్తులు ఎన్కౌంటర్ చేసి పారేసి వారేమో.
గతంలో రాపిడో యాడ్ కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనందరికీ తెలిసిందే పైగా నోకియా అనే ఒక పేరు పెట్టుకొని మంచు వారి అబ్బాయి ఓ సినిమా తీసిన కూడా చివరికి ఆ సినిమా పేరు నూకయ్యగా మార్చుకోవాల్సి వచ్చింది.







