హుజూరాబాద్ బరిలో టీడీపీ ఉందా ? జనసేన పరిస్థితేంటో ? 

తెలంగాణలో హుజురాబాద్ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి.అన్ని ప్రధాన పార్టీలు ఇక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టి, ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి.

ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించగా, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేసే అవకాశం ఉంది.కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.

ఇదిలా ఉంటే ఇక్కడి నుంచి మిగతా పార్టీలు పోటీ చేస్తున్నాయా లేదా అని చర్చ మొదలైంద.ముఖ్యంగా టిడిపి, వైస్సార్ టిపి, బి ఎస్ పి, జనసేన, తీన్మార్ మల్లన్న ఇంకా మిగతా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై షర్మిల స్పష్టమైన ప్రకటన చేశారు.ఈ ఎన్నికల వల్ల పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదని షర్మిల మాట్లాడడం తో ఆ పార్టీ హుజురాబాద్ లో పోటీ చేయదు అనే విషయం అర్థమైపోయింది.

Advertisement

దీంతో తెలుగుదేశం పార్టీ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.గతంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో టిడిపికి గట్టి పట్టు ఉండేది.

అయితే ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆ పట్టు కోల్పోయింది.ఇటీవలే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ను టిఆర్ఎస్ లో చేర్చుకోవడంతో బక్కాని నర్సింహులు లకు తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు.

ఇప్పుడు ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి జరగబోతున్న ఎన్నికలలో టిడిపి తరఫున అభ్యర్థిని నిలబడతారా ? నిలబెట్టకపోతే దానికి కారణాలు చెబుతారా అనేది తేలాల్సి ఉంది.

ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోయినా పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే.ఇక బిఎస్పి, సిపిఐ, సిపిఎం పార్టీలు ఏ వైఖరి తో ముందుకు వెళ్తాయి అనేది స్పష్టత లేదు.ఇక జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందా లేదా ? తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది.అయితే గతంలో జనసేన ను ఉద్దేశించి తెలంగాణ బిజెపి నాయకులు చేసిన వ్యాఖ్యలు పవన్ కు ఆగ్రహాన్ని కలిగించాయి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

దీంతో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతు గా జనసేన ప్రచారం చేయడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది .జనసేన నేరుగా ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, బిజెపి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించకపోతే ఆ తర్వాత తలెత్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది తేలాల్సి ఉంది.ఏదేమైనా ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్, కాంగ్రెస్, మధ్య కొనసాగేలా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు