తెలంగాణలో అమలు చేసే పథకాలు దేశంలో ఎక్కడా లేవు:ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు

నల్లగొండ జిల్లా:రైతు బంధు,రైతు భీమా,దళిత బంధు,కళ్యాణలక్ష్మీ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అస్సలు లేవని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.

మంగళవారం మిర్యాలగూడలోని శ్రీమన్నారయణ ఫంక్షన్ హాల్లో రెండవ రోజు జరిగిన మిర్యాలగూడ మండల ఆత్మీయ సమ్మేళన సభలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి సభ్యులు, రాజకీయ విశ్లేషకులు నరసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తోందే తప్ప అభివృద్ధి శూన్యమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు.ఇలాగే బంగారు తెలంగాణ సాధనకు మరింత కృషి చేస్తామని అన్నారు.

There Are No Schemes Implemented In Telangana Anywhere In The Country: MLA Nalla

అనంతరం ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో రైతు ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి,మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్,జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి,ఎంపీపీ నూకల సరళ,వైస్ ఛైర్మన్ కుర్ర విష్ణు,జిల్లా నేత నల్లమోతు సిద్ధార్ధ,వైస్ ఎంపీపీ అమరావతి సైదులు,మండల అధ్యక్షుడు సైదులు యాదవ్,ఏడుకొండలు, చౌగాని భిక్షంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

Latest Nalgonda News