వేధించిన వ్యక్తిని పంచాయితీలో చెప్పుతో కొట్టిన యువతి..నెటిజన్స్ ఫిదా..!

ఇటీవలే మహిళలను( Women ) వేధించడం, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం లాంటి దారుణాలు అధికం అవుతున్నాయి.

చాలామంది మద్యానికి, చెడు అలవాట్లు బానిసై రోడ్డుపై వచ్చి పోయే వారితో తమ వికృత చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలకు చెందిన వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన.

ఎంత కఠినంగా శిక్షించిన సమాజంలో మార్పు అనేది లేదు.ప్రతిరోజు ఏదో ఒక చోట అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఇటీవలే ఓ వ్యక్తి ఒక యువతి పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.దీంతో ఆ యువతి పంచాయితీ పెట్టి గ్రామస్తుల అందరి ముందట ఆ ఆకతాయిను చెప్పుతో కొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్( Hapur in Uttar Pradesh ) లో చోటుచేసుకుంది.

Advertisement

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ లో ఉండే యువతిని అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు వేధించాడు.

ఆ యువతి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అతను పదేపదే వేధించడంతో చివరికి చేసేది ఏమీ లేక ఆ యువతి తన కుటుంబంతో కలిసి గ్రామ పంచాయితీ( Gram Panchayati ) పెద్దలకు ఫిర్యాదు చేసింది.

పంచాయితీ పెద్దలు చేసిన విచారణలో ఆ యువకుడిదే తప్పు అని తేలింది.అనంతరం ఆ యువకుడికి చెప్పు దెబ్బల శిక్ష విధించారు.40 సెకండ్లలో 15 చెప్పు దెబ్బలు కొట్టాలని పంచాయితీ శిక్ష విధించింది.ఆ శిక్షను ఆ యువతితో అమలుపరచగా గ్రామస్తులు అందరి ముందు ఆ యువకుడిని చెప్పుతో కొట్టింది.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

ఆ తర్వాత గ్రామస్తులంతా చూస్తూ ఉండగా ఆ యువతికి చేతులు జోడించి మరి యువకుడు క్షమాపణలు చెప్పాడు.అనంతరం గ్రామస్తులు అతని మెడలో ఓ చెప్పుల దండ వేసి, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కొంతమంది పంచాయితీ తీర్పును సమర్థిస్తే మరికొంతమంది ఇలా పంచాయితీలు శిక్ష విధించడం సరికాదని ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి ఆ యువకుడికి తగిన శాస్తి జరిగిందని చాలామంది నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు