భారత్ సాధించిన పురోగతిని చూసి ముచ్చటపడిన ప్రపంచ బ్యాంక్!

అవును, మీరు విన్నది నిజమే.భారత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతుంది అని స్వయంగా ప్రపంచ బ్యాంకు కీర్తించింది అంటే మీరు నమ్మితీరాల్సిందే.

భారత్ ఇపుడు అన్ని రంగాలలోను అంచలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ దేశాల దృష్టిని సైతం ఆకర్షిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ క్రమంలో భారత్ డిజిటల్ ప్రయాణాన్ని ప్రపంచబ్యాంక్ ఆకాశానికేత్తేసింది.

నరేంద్ర మోదీ( Narendra Modi ) నాయకత్వంలో గడిచిన పదేళ్లలో డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరంగా భారత్ సాధించిన పురోగతిని ప్రశంసించింది అని కీర్తించింది.ఈ మేరకు ఒక నివేదికను కూడా విడుదల చేసింది.

ఈ నేపధ్యంలో ప్రపంచ బ్యాంకు పేర్కొంటూ.ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయడంలో భారత్ సాధించిన ఫలితాలను ప్రపంచ బ్యాంక్( World Bank ) ప్రస్తావించింది.సామాన్యులకు సున్నా బ్యాలన్స్ తో కూడిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన( Pradhan Mantri Jan Dhan Yojana ) (బ్యాంక్ ఖాతాల పథకం), ఆధార్ అనేవి ఆర్థిక సేవల విస్తృతికి తోడ్పడినట్టు కూడా చెప్పుకొచ్చింది.

Advertisement

కేవలం ఆరేళ్లలో 2018 నాటికి ఉన్న 25 శాతం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (ఆర్థిక సమ్మిళిత రేటు)ను 80 శాతానికి చేర్చినట్టు కీర్తించింది.అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో 47 ఏళ్లు ముందుకు తీసుకెళ్లినట్టు పేర్కొంది.

అంతేకాకుండా భారత్ లో డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ సేవలనే కాకుండా, ప్రైవేటులోనూ సామర్థ్యాలు పెరిగేందుకు ఇది దారితీసినట్టు ప్రపంచబ్యాంక్ అందులో వివరించింది.భారత్ సాధించిన అద్భుతమైన యూపీఐ విజయాన్ని కూడా ప్రపంచ బ్యాంక్ ప్రస్తావించింది.ఒక్క 2023 మే నెలలోనే రూ.14.89 లక్షల కోట్ల విలువ చేసే 941 కోట్ల యూపీఐ లావాదేవీలు( UPI transactions ) నమోదైనట్టు కూడా వెల్లడించింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల విలువ భారత్ జీడీపీలో 50 శాతంగా ఉంటుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు