వావ్, టీ20 మ్యాచ్‌లో క్రీజ్‌లో ఉండే డబుల్ సెంచరీ చేసిన వెస్టిండీస్ ప్లేయర్..!

కేవలం 120 బంతులతో ఆడే టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీ చేయడం చాలా కష్టం అనే చెప్పాలి.ఇక డబుల్ సెంచరీ సాధించడం మరింత కష్టం.

నిజానికి డబుల్ సెంచరీ చేయడం దాదాపు అసాధ్యం.అలాంటిది తాజాగా ఒక క్రికెట్ ప్లేయర్ చాలా సునాయసంగా డబుల్ సెంచరీ చేశాడు.

ఈ స్టార్ ప్లేయర్ 22 సిక్సులు, 17 ఫోర్లు బాది జస్ట్ 77 బాల్స్‌లో ఏకంగా 205 రన్స్ చేశాడు.ఈ డబుల్ సెంచరీయే గొప్ప రికార్డ్ అనుకుంటే అతడు దీనిని సాధించిన తీరు కూడా అందర్నీ ఆశ్చర్య పరిచింది.

అది ఏంటంటే, ఈ స్టార్ బ్యాటర్ క్రీజులోంచి కదలకుండానే డబుల్ సెంచరీ చేశాడు.దీనర్థం అతడు ఒక్క రన్ కూడా చేయలేదు.

Advertisement

కేవలం బౌండరీల ద్వారానే 200 పరుగులు చేశాడు.బౌండరీలు కౌంట్స్ చేస్తే 39 మాత్రమే వస్తాయి.

అంటే అతడు 39 బంతుల్లోనే 200 సాధించాడు.మిగతా 38 బంతుల్లో అతడు 5 రన్స్ చేశాడు.

నిజానికి ఈ ప్లేయర్ వికెట్ల మధ్య రన్స్‌ తీయలేడు.రన్స్ కోసం ఎక్కువగా ప్రయత్నిస్తే అవుట్ అయిపోతాడు.

ఆ బ్యాటర్ మరెవరో కాదు వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ రఖీమ్ కార్న్‌వాల్. అట్లాంటా ఓపెన్ అమెరికా టీ20 పోటీలలో భాగంగా జరిగిన ఒక మ్యాచ్‌లో కార్న్‌వాల్ ఈ అద్భుతమైన ప్రదర్శన చూపించాడు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

అయితే ఈ ప్లేయర్ చాలా ఎత్తు,బరువు ఉంటాడు.ఆ భారీ కాయంతో రన్స్ తీయడం కూడా కష్టమే.

Advertisement

అందుకే పరుగులతో సంబంధం లేకుండా బౌండరీలతో ఈ రికార్డును సృష్టించాడు.

తాను సిక్సర్లు బాదుడు చాలా కామన్ అని ఈ ప్లేయర్ చెబుతుంటాడు.ఈ రికార్డు సృష్టించిన సందర్భంగా 360 డిగ్రీల్లో బంతులను స్టాండ్స్ లోకి అలవోకగా పంపించగల ఏకైక ప్లేయర్ తానేనని సొంత పొగడ్తలు కూడా చేసుకున్నాడు.మరి వచ్చే ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఈ విధ్వంసకర బ్యాటర్‌ను ఏ టీమ్ అయినా కొనుగోలు చేస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు