స్వలింగ వివాహాలపై కాసేపట్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు

స్వలింగ వివాహాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది.ఈ క్రమంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ధర్మాసనంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.పిటిషన్ పై దాదాపు పది రోజులపాటు వాదనలు విన్న ధర్మాసనం మే 11వ తేదీన తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.

విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపించగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సరైన చర్య కాదని తెలిపింది.దీని ప్రతికూల ప్రభావాన్ని కోర్టు ఊహించలేదని, అదేవిధంగా సరిదిద్దడం సరికాదని వెల్లడించింది.

ఈ క్రమంలో స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement
ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?

తాజా వార్తలు