బైక్‌ స్పీడోమీటర్‌లో దూరిన పాము.. తర్వాత ఏమైందంటే

పాములు విషపూరితమైనవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అవి చెట్లు, పుట్టలలోనే కాకుండా ఒక్కోసారి ఇళ్లల్లోకి దూరుతుంటాయి.

చెప్పుల స్టాండ్లలోనో, బూట్లలోనూ నక్కి ఉంటాయి.ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా కాటేసి ప్రాణాలు తీస్తాయి.

కాబట్టి వర్షాకాలం, చలికాలం కాస్త అప్రమత్తంగా ఉండడం అత్యవసరం.ఇళ్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

చుట్టూ చెట్లు వంటివి ఉన్నప్పుడు పాములు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది.కప్పలు వంటి వాటిని వేటాడుతూ పాములు ఇళ్లలో దూరుతాయి.

Advertisement

ఇటీవల తెలంగాణలో ఓ ఇంట్లోకి పాము దూరగా, దానిని బయటకు రప్పించేందుకు ఓ వ్యక్తి పొగబెట్టాడు.తీరా మంటలు ఇల్లంతా అంటుకుని కాలిపోయింది.

కొన్ని సందర్భాల్లో బైకులలోకి కూడా పాములు దూరి రెస్ట్ తీసుకుంటున్నాయి.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో నజీర్‌ఖాన్ ఇటీవల రెండు రోజుల క్రితం తన బైక్ ను ఎప్పటిలాగే రాత్రి ఇంటి బయట పార్క్ చేశాడు.

తర్వాత రోజు ఉదయాన్నే ఏదో పని మీద బైక్‌పై బయటకు బయల్దేరాడు.మార్గమధ్యంలో అతడికి ఏదో తేడాగా అనిపించింది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

అనుమానంతో బైక్ స్పీడోమీటర్ చూడగానే షాక్ అయ్యాడు.జాగ్రత్తగా చూసే సరికి బైక్ స్పీడోమీటర్ గ్లాసులో నల్లటి తాచు పాము కనిపించింది.

Advertisement

వెంటనే బైక్ రోడ్డుపై ఆపేసి పక్కకు వెళ్లిపోయాడు.స్థానికులకు ఈ విషయం చెప్పగానే ఈ వింత సంఘటనను చూసేందుకు చాలా మంది గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు.

వారిలో కొందరు పామును మోటారు సైకిల్‌లో నుంచి బయటకు తీసేందుకు కూడా ప్రయత్నించారు.కొందరు బైక్‌లోని మీటర్ గ్లాస్‌ను పగలగొట్టి, చాలా గంటలపాటు శ్రమించి పామును నెమ్మదిగా బయటకు తీశారు.

ఆ తర్వాత దానిని నిర్మానుష్య ప్రదేశంలో విడిచి పెట్టారు.దీంతో ముప్పు తప్పిందని నజీర్ ఖాన్ ఊపిరి పీల్చుకున్నాడు.

ఏ మాత్రం బైక్ నడుపుతున్నప్పుడు తనను కాటేసి ఉంటే ప్రాణం పోయేదని అతడు పేర్కొన్నాడు.

తాజా వార్తలు