రూట్ సర్వే చేస్తున్న బస్ కు స్వాగతం పలికిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) ఆర్టిసి డిపో నుండి గొల్లపల్లి , రాజన్నపేట, కిష్టు నాయక్ తండా,అల్మాస్ పూర్ గ్రామం నుండి వీర్నపల్లి మోడల్ స్కూల్ కు బస్ నడిపేందుకు రూట్ సర్వే కు వచ్చిన బస్ కు అల్మాస్ పూర్ సర్పంచ్ రాదారపు పుష్పలత( Pushpa ),పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మరియు గ్రామస్థులు స్వాగతం పలికారు.

గొల్లపల్లి,రాజన్నపేట, కీష్టు నాయక్ తండా,ఆల్మాస్ పూర్ కు చెందిన సుమారు 35మంది విద్యార్థుల కు పైగా వీర్నపల్లి మోడల్ స్కూల్( Veernapalli Model School ) లో చదువుకుంటున్నారు.

విద్యార్థులకు మోడల్ స్కూల్ కు సౌకర్యం కల్పించడం కోసం బస్ ను త్వరలో ప్రారంభించనున్నారు.అల్మాస్ పూర్ విద్యార్ధులు మోడల్ స్కూల్ కు వెళ్ళడం కోసం స్కూల్ బ్యాగ్ లతో ఎల్లమ్మ గుడి వద్దకు వెళ్లి బస్ లేదా ఆటో లో వెళ్ళేవారు.

ఈ బస్ ప్రారంభమైతే ఇట్టి కష్టం నుండి విద్యార్థులు బయటపడనున్నారు.అదే విధంగా ఆటో లో వెళ్లకుండా రాజన్నపేట , కిష్టూ నాయక్ తండా వరకు వెళితే పది రూపాయలు, ఆల్మాస్ పూర్ వరకు వెళితే ఇరవై రూపాయలు బస్ ఛార్జ్ చేయబడుతుందనీ విలేజ్ బస్ ఆఫీసర్ ఎల్ రాంరెడ్డి నాయక్ తెలిపారు.

వీరి వెంట ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆల్మాస్ పూర్ ప్రజలు ఉన్నారు.

Advertisement
ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News