ప్రాణాలకు తెగించి క్రిమినల్‌ని పట్టుకున్న పోలీస్.. థ్రిల్లింగ్ వీడియో వైరల్..

కొన్ని సినిమాల్లో చూసే థ్రిల్లింగ్ చేసింజ్ దృశ్యాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి, అదే అవి నిజ జీవితంలో జరిగి కెమెరాలో రికార్డ్ అయితే మరింత ఆశ్చర్యపోక తప్పదు.

అలాంటి ఓ ఆశ్చర్యకరమైన సంఘటన బెంగళూరులోని ఒక రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

ఈ వీడియో ప్రకారం, ఒక బ్రేవ్ పోలీస్ కానిస్టేబుల్( Police Constable ) ఒక దొంగను పట్టుకోవడానికి తన ప్రాణాన్ని లెక్క చేయలేదు.ఈ వీడియోలో మనం ఒక రోడ్డు జంక్షన్ వద్ద వాహనాలు వెళుతున్న దృశ్యం కనిపిస్తుంది.

అంతా నార్మల్ గా అనిపిస్తున్న సమయంలో, ఒక మనిషి స్కూటర్ మీద వస్తున్న మరొక మనిషిని ఆపేశాడు.ఆ స్కూటర్ మీద ఉన్న వ్యక్తి మంజేష్ అనే దొంగ.

అతని మీద 75 పోలీస్ కేసులు ఉన్నాయి.అతనిని ఆపిన వ్యక్తి సివిల్ దుస్తుల్లో ఉన్న దొడ్డ లింగయ్య అనే కానిస్టేబుల్.

Advertisement

మంజేష్ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి, అతను చట్టానికి లొంగిపోయి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు.కానీ అతను పోలీసు కానిస్టేబుల్‌ మంచి తప్పించుకోవడానికి స్కూటర్‌ను వేగంగా డ్రైవ్ చేశాడు.స్కూటర్‌తో కానిస్టేబుల్ లింగయ్యను లాక్కెళ్ళాడు కూడా.

అయినా పోలీస్ అధికారి మంజేష్‌ను వదలకుండా పట్టుకున్నాడు.స్కూటర్‌తో పాటు దాదాపు 20 మీటర్లు లాగబడ్డాడు.

చివరకు కిందపడి రోడ్డుపై జారుతూ వెళ్ళాడు.

అయినా కూడా మంజేష్( Manjesh ) కాలిని వదలలేదు.అతని తల స్కూటర్ చక్రాలకు చాలా దగ్గరగా ఉంది.చివరకు మంజేష్ స్కూటర్ ఆగిపోయింది.

వీడియో: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన కూతురు.. గవర్నమెంట్ జాబ్ ఉందని తెలిసి..?
ల్యాండ్ స్లయిడ్ నుంచి మనిషిని రక్షించిన కుక్క.. ప్రాణాలకు తెగించిందిగా..?

అప్పటికే ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగను చుట్టుముట్టారు.మంజేష్ అంతటితో ఆగలేదు.

Advertisement

అతను మునుపు ఎన్నో నేరాలు చేసిన వ్యక్తి కాబట్టి, మూడుగురు పోలీసులను కొడుతూ వారిని పక్కకి తోస్తూ పారిపోవాలని ప్రయత్నించాడు.ఒక లేడీ పోలీస్‌ను కూడా తోసేశాడు.

కొద్దిసేపు తడబడిన ఆమె మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది.అప్పటికే చాలా మంది ప్రజలు అక్కడ చేరి పోలీసులకు సహాయం చేశారు.

వారు మంజేష్‌ను బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు.వార్తల ప్రకారం, మంజేష్ తుమ్కూరు నుంచి బెంగళూరు( Bengaluru )కు పారిపోతున్నాడు.

అతన్ని పోలీసులు అరెస్టు చేసి, అతని దగ్గర నుండి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు