రైస్ బ్యాగులపై జీఎస్టీ పడకుండా మిల్లర్లు అదిరిపోయే ప్లాన్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల సామాన్యులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.పాలు, పెరుగుతో పాటు పాలు ఉత్పత్తులన్నిటిపై 5 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

అలాగే బియ్యం, గోధుముల లాంటి నిత్యావసర వస్తువులపై కూడా 5 శాతం జీఎస్టీ విధించింది.దీంతో పాలు, పెరుగుతో పాటు నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగనున్నాయి.

దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, వంటగ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది.ఇప్పుడు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువులపై కూడా భారం వేయడంతో సామాన్యులపై గుది బండ వేసినట్లైంది.అయితే 25 కేజీల వరకు ఉన్న రైస్ బ్యాగులపై 5 శాతం జీఎస్టీ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో బియ్యం ధరలు కూడా పెరగనున్నాయి అయితే బియ్యం బ్యాగులపై జీఎస్టీ పడకుండా కర్ణాటకలోని రైస్ మిల్లర్లు భారీ ప్లాన్ చేశారు.25 కేజీల బియ్యం బస్తాలను కాకుండా 30 కేజీల చొప్పున బియ్యం బస్తాలు అమ్మాలని నిర్ణించారు.25 కేజీల వరకు ఉన్న బియ్యం బస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల రైస్ బ్యాగ్ ధర రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగింది.దీంతో రూ.30 కేజీ రైస్ బ్యాగ్ ను అమ్మాలని రైస్ మిల్లర్లు నిర్ణయించారు.దీని వల్ల కస్టమర్లకు భారం తగ్గుతుందని, తమకు కూడా లాభిస్తుందని మిలర్లు అంటున్నారు.

Advertisement

30 కేజీల రైస్ బ్యాగ్ లను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేసేందుకు మిలర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.26 కిలోల సచుల్లో లేదా 30 కిలోల సచుల్లో బియ్యం వేసి విక్రయిస్తామంటున్నారు.కొత్త సంచులు రావడానికి 20 రోజుల సమయం పట్టే అవకాశముందని, అప్పటివరకు కస్టమర్లు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు