మునగ సాగు నాటుకొనే విధానం..మేలైన ఎరువుల యాజమాన్యం..!

మునగ సాగును( Drumstick ) సరైన యాజమాన్య పద్ధతిలో నాటుకొని అవసరమైన ఎరువులను సకాలంలో అందించి ఈ మెళుకువలను పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.

ఈ పంట సాగు చేయడానికి నీటి వసతి ఉండే అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.

నేల యొక్క పీహెచ్ విలువ 6-7 మధ్యన ఉంటే అధిక దిగుబడి ( High yield )సాధించవచ్చు.మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు( Seeds ) అందుబాటులో ఉన్నాయి.

తెగులు నిరోధక, కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.ఒక ఎకరాకు 250 గ్రాముల విత్తనాలు అవసరం.

ముందుగా నారును పెంచడానికి 4i9 అంగుళాల పాలిథిన్ సంచుల్లో ఎర్రమట్టి, పశువుల ఎరువును 2:1 నిష్పత్తిలో కలిపి ఆ సంచులను నింపుకొని వరుసగా అమర్చుకోవాలి.సంచులకు కింది భాగంలో నాలుగు లేదా ఐదు రంద్రాలు చేస్తే నీరు సంచిలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది.

Advertisement

ముందుగా సంచిలోని మిశ్రమం అంతా తడిచేటట్లు నీరు పోయాలి.ఆ సంచి ఆరిన తర్వాత ఒక్కో సంచిలో ఒక్కో విత్తనాన్ని రెండు సెంటీమీటర్ల లోతులో నాటి పల్చగా నీరు పోయాలి.

నారు మొక్కలను సంచులలో 30 రోజులు పెంచిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ప్రధాన పొలాన్ని రెండుసార్లు దుక్కి దున్ని, అందులో ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువులు వేసి కలియదున్ని చదును చేయాలి.పొలంలో 2.5 i 2.5 మీటర్ల దూరంలో 45 I 45 ఘన సెంటీమీటర్ల గుంతలను తీయాలి.ఒక ఎకరంలో దాదాపుగా 650 మొక్కలను నాటుకోవాలి.3I2 మీటర్ల దూరంలో నాటుకుంటే అంతర పంటలు సాగు చేసుకోవడానికి వీలు ఉంటుంది.

మొక్కను నాటేటప్పుడు వేర్లకు ఏమాత్రం హాని కలిగించకుండా పాలిథిన్ సంచిని మాత్రమే తొలగించి మొత్తం మట్టితో సహా మొక్కలను గుంతలో నాటుకోవాలి.నేల యొక్క తేమశాతాన్ని బట్టి ఏడు నుండి పది రోజుల మధ్యలో ఒకసారి నీటి తడులు అందించాలి.ఎరువుల విషయానికి వస్తే నాటుకునేటప్పుడే 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 250 గ్రాముల సూపర్ ఫాస్పేట్, 250 గ్రాముల వేప పిండిని కలిపి పొలంలో వేయాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వైరల్: సాక్స్‌లు లేకపోతే ఏం... ఇలా ఎపుడైనా ఆలోచించారా?

మునగ నాటిన 3, 6, 9 నెలలకు ఒక్కో ముక్కకు 100 గ్రాముల యూరియా, 75 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీటి తడులు అందించాలి.కలుపు మొక్కలు పెరగకుండా అంతర కృషి చేపడితే అధిక దిగుబడి పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు