వికలాంగుల స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయం తేల్చాలి...!

స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అడ్డంకులు ఏమిటో స్వష్టం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్డిమాండ్ చేశారు.ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కుర్ర గోపి అధ్యక్షతన నిర్వహించిన గరిడేపల్లి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి అయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ రిజర్వేషన్ కల్పిస్తే మరోసారి ప్రగతి భవన్ కు పంపుతామని,లేకుంటే పర్మినెంట్ గా ఫామ్ హౌస్ కి పంపుతామని అన్నారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అడ్డంకులు ఏమిటో స్వష్టం చేయాలని,తెలంగాణ ఉద్యమంలో వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ముందుండి పోరాడిన వికలాంగుల సమాజానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఓరగబేట్టింది ఏమీలేదని అవేదన వ్యక్తం చేశారు.తమ పోరాటాలతోనే 3016ల పెన్షన్ సాధించుకున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వికలాంగుల సమాజంపై చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని ముందుకు వస్తే మరొకసారి ప్రగతి భవన్ కు పంపుతామని ముందుకు రాకుంటే పర్మినెంట్ గా ఫామ్ హౌస్ కు పంపుతామని హెచ్చరించారు.

అధేవిధంగా ప్రజా సమస్యలపై పాదయాత్రలు చేసే ప్రధాన పార్టీల అధ్యక్షులు అయిన బండి సంజయ్,రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వికలాంగుల సమస్యలపై ముఖ్యంగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకై పోరాటాలు పాదయాత్రలు చేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు.వికలాంగుల సమాజం పట్ల రాజకీయ పార్టీలు నేతలు చిన్న చూపు చూస్తున్నారనటానికి ఇవే నిదర్శనం అన్నారు.

రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించేంతవరకు ముఖ్యంగా 15 లక్షలతో వికలాంగుల బంధు పథకాన్ని తీసుకువచ్చేంత వరకు ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్,జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు ధరావత్ రవీందర్ నాయక్,సంఘం నాయకులు సతీష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

Latest Suryapet News