భార్యకి అడ్డంగా దొరికిపోయిన భర్త... షాపింగ్‌ మాల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు!

సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఇటివంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.అతగాడికి అప్పటికీ వివాహం అయింది.

అయినా అతడు వేరే స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.దాంతో వారి వివాహ బంధంలో కలతలు చెలరేగాయి.

భర్తకు భార్య దూరం జరిగి పుట్టింట్లో నివాసం ఉంటోంది.ఇదే అదనుగా చేసుకొని అతడు ఆ యువతితో ఎంజాయ్‌ చేస్తూ వున్నాడు.

ఒకసారి వారు షాపింగ్ కోసమని ఓ మాల్ కి వెళ్లారు.కట్ చేస్తే భార్య.

Advertisement

వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.షాకింగ్‌ మాల్‌లో అందరి ముందే చితకబాదింది.

తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే, UPలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ జంట గొడవల కారణంగా భార్య తన పుట్టింట్లో ఉంటోంది.

కార్వా చౌతా పండుగ సందర్భంగా ఆమె తన తల్లితో కలిసి షాపింగ్‌ చేసేందుకు ఓ మాల్‌కు వెళ్లింది.సరిగ్గా అదే సమయంలో తన భర్త మరో యువతితో షాపింగ్‌ చేస్తుండటాన్ని ఆమె గమనించింది.

దీంతో, వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీసింది.భర్త కాలర్‌ పట్టుకుని.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావంటూ అక్కడే అందరూ చూస్తుండగానే చితకబాదింది.

Advertisement

భర్తతో వచ్చిన సదరు యువతికి సైతం దెబ్బలు పడ్డాయి.ఈ రసవత్తరమైన ఘటన చూడటానికి షాపింగ్‌ మాల్‌లో షాపింగ్ కోసం వచ్చిన కస్టమర్లు బట్టలు కొనడం మానేసి ఈ రాద్ధాంతాన్ని తిలకించారు.దీంతో, మాల్‌లోని కొందరు దుకాణాల యజమానులు వారిని బయటకు వెళ్లిపోవాలని సూచించారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై అతని భార్య.పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు