అక్కినేని హీరోలకు కోలుకోలేని దెబ్బ.. అన్ని కోట్ల నష్టాలు తెస్తే ఎలా?

అక్కినేని హీరోల్లో నాగార్జున ఒకరు.ఈయన సీనియర్ హీరో అయినప్పటికీ తన కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు.

 Akkineni Heroes At Box Office, Akkineni Nagarjuna, Akkineni Heroes, Akkineni Nag-TeluguStop.com

అయితే ముగ్గురు హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్న అక్కినేని కుటుంబం ఒక్కోసారి హుషారుగా వరుస హిట్స్ తో కనిపిస్తుంది.మరోసారి వరుస డిజాస్టర్స్ తో రేసులో వెనుకబడి పోతుంది.

నాగ్ అయితే హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.

ఇటీవలే బంగార్రాజు సినిమాను తన కొడుకుతో కలిసి చేసి హిట్ అందుకున్నాడు.

సంక్రాంతి రేసులో వచ్చిన ఈ సినిమా అంత గొప్పగా లాభాలు రాబట్టలేక పోయిన పండుగ సీజన్ కావడంతో బాగానే ఆడింది.ఏదో విధంగా ఈ సినిమా పెట్టుబడి మాత్రం వెనక్కి తెచ్చింది.39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా అంతే రాబట్టింది.ఇక ఆ తర్వాత నాగ చైతన్య థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Telugu Akkineni Akhil, Akkineni Heroes, Akkineniheroes, Akkineninaga, Box, Ghost

విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమా 24 కోట్ల బిజినెస్ చేయగా కేవలం 4 కోట్లు మాత్రమే రాబట్టింది.దీంతో 20 కోట్ల నష్టాలు వచ్చాయి.ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అయ్యింది.ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ అయ్యింది.

Telugu Akkineni Akhil, Akkineni Heroes, Akkineniheroes, Akkineninaga, Box, Ghost

ఈ సినిమా 22 కోట్ల ప్రీ రిలీజ్ చేయగా సగం కూడా రాబట్టలేక పోయింది.ఈ సినిమా ఏకంగా 15 కోట్ల నష్టాలు వచ్చినట్టు సమాచారం.మరి కొడుకు 20 కోట్ల నష్టాలు తేగా తండ్రి సినిమాకు 15 కోట్ల నష్టాలు వచ్చాయి.

దీంతో అక్కినేని హీరోలు ఢీలా పడిపోయారు.ఇక రాబోయే రోజుల్లో అఖిల్ ఏజెంట్ సినిమాతో రాబోతున్నాడు.

ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.మరి అఖిల్ అయిన అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ నింపుతాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube