తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు పరారీ

తిరుపతి జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు పరార్ అయినట్లు తెలుస్తోంది.

కోట్ల రూపాయలు చిట్టీల డబ్బుతో అర్చకుడు, ఆయన భార్య పద్మశ్రీ వాణి పరార్ అయినట్లు గుర్తించారు.

బాబు స్వామిగా ప్రతాప్ స్వామి పలువురికి సుపరిచితుడు.గత కొన్ని సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న బాబు స్వామి.

The Head Priest Of Tiruchanur Padmavati Ammavari Temple Is On The Run-తిర�

చిట్టీ గడువు ముగిసి మూడేళ్లవుతున్నా ఇంకా డబ్బులు చెల్లించలేదు.ఈ క్రమంలోనే బాబు స్వామి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెంది నిన్న ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సూసైడ్ నోట్ రాసిన వ్యాపారి నితిన్ ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.మృతుని భార్య తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న బాబు స్వామి, పద్మశ్రీవాణిల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?
Advertisement

తాజా వార్తలు