అకాల వర్షాలతో రైతుల పాట్లు.. కనికరించని ప్రభుత్వ పెద్దలు.. ?

దేశానికి రైతు విలువ ఎప్పుడు తెలుస్తుందో అర్ధం కాదు.

రైతు అంటే ఉన్న చిన్న చూపు, రైతు అంటే ఉన్న నిర్లక్ష్యం, రైతు పట్ల ప్రవర్తనలో మార్పు రావాలి.

నిజానికి రైతు లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుంది.ఇలా కంటికి కనిపించని శక్తివంతుడైన రైతు ప్రస్తుత పరిస్దితుల్లో ఎన్నో సవాళ్లను అధిగమించి జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు.

ఇకపోతే రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో కర్షకుడు సతమతం అవుతున్నాడు.తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దయనీయంగా మారింది.

ఇదిలా ఉండగా ఓ సందర్భంలో సీఎం కేసీఆర్ మొత్తం 6,700 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, ఏప్రిల్ మొదటి నుంచే కొనుగోలు కేంద్రాలు మొదలవుతాయని ​వెల్లడించారు.కానీ ఇప్పటికే 22 రోజులు గడిచినా 10 శాతం కేంద్రాలను కూడా ప్రారంభించలేదు.

Advertisement

ఇందువల్ల ఊహించకుండా వస్తున్న వర్షాలకు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతుంది.మరోవైపు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ మంత్రి నిరంజన్​రెడ్డి ఇటీవల ప్రకటించారు.

కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు చేయడం లేదు.దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ధాన్యాన్ని దళారులకు అప్పగిస్తున్నారు.

ఇకపోతే ప్రధానంగా పుర ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల వైపు నేతలు, అధికారులు కన్నెత్తి చూడటం లేదు.ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

చూశారా రైతుల పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిర్లక్ష్యం.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు