ఏపీలో ఈ నెల 7, 8 తేదీలను  సెలవు దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7, 8 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.

పరిషత్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పరిషత్ ఎన్నికల ఏర్పాట్లకు 7న, పోలింగ్ కోసం 8న సెలవులు ఇస్తున్నట్లు నోటీసులో పేర్కొనటం జరిగింది.స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదే తరుణంలో రాష్ట్రంలో దుకాణాలు మరియు వాణిజ్య సంస్థలు కూడా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది.ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిషత్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే.

ఆమె పదవి బాధ్యతలు చేపట్టడం తర్వాత రోజు పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికారులతో సమావేశం అవ్వడం వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.అయితే ఈ ఎన్నికలను విపక్షాలు వ్యతిరేకిస్తూ ఉండగా అధికార పార్టీ వైసీపీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తూ పంచాయితీ, మున్సిపల్ కార్పొరేషన్ విజయపరంపర పరిషత్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని మంచి ఉత్సాహంగా ఉంది.

Advertisement

 .

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు