సస్పెండ్ అయిన సీఈవోకే చార్జ్ ఇచ్చిన చైర్మన్?

నల్లగొండ జిల్లా:అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ కి గురైన నిడమనూరు మండలం వెనిగండ్ల పిఎసిఎస్ సొసైటీ సీఈవో జివి రాఘవరావు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయకుండా, పిఎసిఎస్ సొసైటీ పాలకవర్గం తీర్మానం లేకుండానే, కేవలం సొసైటీ చైర్మన్ అనుమతితో తిరిగి అదే సొసైటీలో సీఈవోగా బాధ్యత స్వీకరించడం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది.

గురువారం వెనిగండ్ల పిఎసిఎస్ పాలకవర్గ సమావేశం పేరుతో సభ్యులు కానివారితో మహాజనసభ నిర్వహించి,ఈ సమావేశంలో సస్పెండ్ అయిన సొసైటీ సీఈవో జి.

వి.రాఘవరావును సోసైటిలో మళ్లీ సీఈవోగా నియమించినట్లు సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.దానికీ పాలకవర్గం కూడా మద్దతు ఇవ్వాలని చైర్మన్ పాలకవర్గాన్ని వత్తిడి చేయడంతో పాలకవర్గ సభ్యులు ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు.

సస్పెండైన సీఈవోను ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా,ఈ సోసైటీలో మళ్లీ సీఈవోగా నియామకం చేయడం చట్ట విరుద్ధమన్నారు.అతనిని నియామకం కాకుండా నిలిపివేయాలని,అదే విధంగా రెండు ఏళ్ల క్రితం గోడౌన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సొసైటీ చైర్మన్ పై కూడా విచారణ జరిపించాలని సొసైటీ సభ్యులు డిసిఓకి వినతిపత్రం అందజేశారు.

పైలట్ ప్రాజెక్టు భూ సర్వే ఎల్లాపురం శివారులో షురూ
Advertisement

Latest Nalgonda News