భూకబ్జాలకి పాల్పడిన పెద్దూర్ తిరుపతి అనే వ్యక్తి పై కేసు నమోదు రిమాండ్ కి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అమాయక ప్రజల బెదిరింపులకు గురి చేసి వారి భూములను కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అన్నారు.

ఈ సందర్బంగా ఎస్పీ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ.

తంగళ్ళపల్లి మండలానికి చెందిన గజభింకర రాధాబాయీ భర్త బాలాజి 1996 సంవత్సరంలో భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇటీవల తంగళ్లపల్లి( Thangallapalli) కి చెందిన పెద్దూరు తిరుపతి అనే వ్యక్తి రాధాబాయీ కి చెందిన 20 గుంటలు భూమిని బెదిరించి ఆక్రమించుకున్నాడు.రాధా భాయ్ ఇచ్చిన పిర్యాదూ మేరకు పెద్దూరు తిరుపతి మీద తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రోజున రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

జిల్లా పరిధిలో భూ కబ్జాలకి సంబంధించిన, నకిలీ భూ పత్రాలు ( Fake land documents )సృష్టించి బేధరింపులకు పాల్పడిన వారి వివరాలు , నెరప్రవృతి గురించి నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయవచ్చు అని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అమాయక ప్రజలను బెదిరిస్తూ, బయబ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News