న‌లుగురు చిన్నారుల ప్రాణం తీసిన కారు సరదా.. !

ఒక చిన్న నిర్లక్ష్యం అతి పెద్ద ప్రమాదంగా మారి ప్రాణాలు తీస్తుందని పలుసార్లు నిరూపించబడింది.

అందులో కరోనా వల్ల రాలిపోతున్న ప్రాణాలతో పాటుగా, నిర్లక్ష్యం వల్ల కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇక ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు గ్యారంటీ లేదు.ఇక చిన్నపిల్లలను అయితే కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పెద్దల పై ఉంది.

The Car That Took Lives Of Four Children In Uttarpradesh , Uttar Pradesh, Singa

ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా కంటికి కనిపించకుండా మృత్యువు గద్దలా తన్నుకుపోతుంది.ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో చోటు చేసుకుంది.

ఓ ఇంటి ముందు పార్కు చేసిన కారులోకి ఎక్కి సరదాగా ఆడుకుంటున్న ఐదుగురు పిల్ల‌లు వారి లోకంలో మునిగి ఉండగా అనుకోకుండా కారు డోర్స్ అన్ని లాక్ అయిపోయాయట.దీంతో వారంతా అందులోనే ఉండ‌డంతో ఊపిరాడ‌లేదు.

Advertisement

అయితే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు వారిని గుర్తించి బ‌య‌ట‌కు తీసే స‌మ‌యానికే న‌లుగురు చిన్నారులు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిపోయాయట.ఇక ఈ ప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేయగా వారు ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని వెల్లడించారు.

ఇది కదరా క్రేజ్ అంటే.. పాకిస్థాన్ బైకులపై '18 విరాట్' (వీడియో)
Advertisement

తాజా వార్తలు