కుక్కలు మనుషులను కరవడం, భయబ్రాంతులకు గురి చేయడం చూస్తాం.అలాగే కొన్ని రకాల క్రూర జంతువులు కూడా మనుషుల తాట తీసేందుకు వేటాడుతాయి.
కానీ ఒంటెలు అలా కాదనే అభిప్రాయం అందరిలో ఉంటుంది.ఒంటెలు ఎవరి జోలికీ వెళ్లవు.
అవి తమ పనేదో తాము చేసుకుని కామ్ గా ఉంటాయి.కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోలో ఒంటె మనిషిని తరుముతూ రూడ్ గా బిహేవ్ చేస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అక్కడ ఒంటె చేసిన పనికి ఆశ్చర్యానికి గురవుతున్నారు.వామ్మో ఒంటెలు ఇలా కూడా ప్రవర్తిస్తాయా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
కార్ ను పార్కింగ్ చేసేందుకు వచ్చిన వ్యక్తిని అక్కడ ఉన్న ఒంటె షాక్ కు గురి చేస్తూ….ముప్పుతిప్పలు పెట్టింది.చివరికి ఏం చేయాలో పాలుపోక సదరు వ్యక్తి కారులోకి దూకి బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.ఇలా ఒంటె విచిత్రంగా ప్రవర్తించడం చూసిన కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా… వైరల్ గా మారింది.
ఆ వ్యక్తి ఒంటె నుంచి తనను తాను రక్షించుకునేందుకు పడిన ఆపసోపాలు చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

అమ్మో ఒంటెలు ఇలా కూడా దాడులు చేస్తాయా అని చర్చించుకుంటున్నారు.అతడు కారులోకి వెళ్లిన తర్వాత కూడా కొద్ది సేపు ఒంటె కారు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది.అతడు లేడని గ్రహించిన ఒంటె అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇప్పటి వరకే ఈ వీడియోను దాదాపు 14 లక్షలకు పైగా మంది చూశారు.
చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ కామెంట్లు, లైకులు చేస్తూ… హోరెత్తిస్తున్నారు.