ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ?  ఆ ఇద్దరిలో ఎవరు ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను మార్చబోతున్నారని, ఆయన స్థానంలో మరొకరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది.

వీర్రాజు బిజెపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యాక్టివ్ గా పని చేశారు.

బీజేపీ లో చేరికలను బాగా ప్రోత్సహించారు.అలాగే బీజేపీ లో ఉంటూ వైసిపి టిడిపిలకు అనుకూలంగా వ్యవహరించే నాయకులు పైన వేటు వేశారు.

పూర్తిగా తన మార్క్ ఏపీ బిజెపిలో కనిపించేలా వీర్రాజు చేయడంతో, పార్టీ హైకమాండ్ కూడా మొదట్లో ఆయనను బాగా ప్రోత్సహించింది.అయితే రాను రాను వీర్రాజు వైఖరిలో మార్పు రావడం, ఆయన వైసీపీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు బీజేపీ పెద్దలు అనుమానించడం,  పైకి విమర్శలు చేస్తున్నా, అంత సీరియస్ గా లేకపోవడం అలాగే వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాటం చేసే అవకాశం ఉన్నా, సైలెంట్ గా వీర్రాజు ఉండడం ఇవన్నీ బిజెపి అధిష్టానం పెద్దలకు ఆగ్రహం కలిగిస్తోంది.

      పూర్తిగా బిజెపి ని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా మార్చాలని డిసైడ్ అయ్యింది.దీనిలో భాగంగానే కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

గతంలో కన్నా లక్ష్మీనారాయణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు.అనేక పోరాటాలు నడిపించారు.

అయితే అప్పట్లో బిజెపి వైసిపి కి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో వీర్రాజు కి బాధ్యతలు అప్పగించారు.   

  అయితే వీర్రాజు బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన ను కలుపుకుపోయే విషయంలో అంత ఆసక్తి చూపించకపోవడం , వైసీపీపై పెద్ద విమర్శలు చేయకుండా, పూర్తిగా టిడిపిని మాత్రమే టార్గెట్ చేసుకోవడం ఇవన్నీ గమనించిన బిజెపి అధిష్టానం వీర్రాజు ను మార్చి ఆదినారాయణ రెడ్డి లేక కన్నా లక్ష్మీనారాయణ ఒకరిని ఏపీ బిజెపి అధ్యక్షుడిగా అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే ఒకటి రెండు సార్లు ఢిల్లీకి వెళ్లిన వీర్రాజు కి ఇదే విషయం పై క్లారిటీ ఇచ్చారట.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు