డ్రై హెయిర్ ను రిపేర్ చేసే బెస్ట్ రెమెడీ మీకోసం!

ప్రస్తుత వింటర్ సీజన్ లో ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మంది కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో డ్రై హెయిర్( Dry Hair ) ఒకటి.

వాతావరణం లో వచ్చే మార్పులు, పొడి గాలి, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వాడటం తదితర కారణాల వల్ల జుట్టు పొడిపొడిగా మారి ఎండు గడ్డి మాదిరి తయారవుతుంది.అయితే ఇటువంటి జుట్టును రిపేర్ చేయడానికి ఒక బెస్ట్ రెమెడీ ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోయాలి.వాటర్ బాయిల్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి 15 నిమిషాల పాటు ఉడికిస్తే జెల్ రెడీ అవుతుంది.స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని కాసేపు చల్లారబెట్టి ఆపై క్లాత్ సహాయంతో అవిసె గింజల జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరటి పండును( Banana ) తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloevera Gel ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఈ సింపుల్ మాస్క్ ను ప్రయత్నించడం వల్ల చాలా సులభంగా పొడి జుట్టు సమస్యను వదిలించుకోవచ్చు.ఈ మాస్క్ డ్రై హెయిర్ ను సమర్థవంతంగా రిపేర్ చేస్తుంది.

జుట్టు ను స్మూత్ గా మరియు సిల్కీ గా మారుస్తుంది.మెరిసే కురులను మీ సొంతం చేస్తుంది.

అలాగే వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు దృఢంగా మారుతుంది.హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది.

కురులు ఒత్తుగా కూడా పెరుగుతాయి.

శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

తాజా వార్తలు