చుండ్రు వేధిస్తోందా... అయితే ఈ చిట్కా మీ కోసమే

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేదించే సమస్యల్లో చుండ్రు ఒకటి.చుండ్రు రావటానికి అనేక కారణాలు ఉంటాయి.

ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, పోష‌ణ లోపం వంటి కారణాలతో చుండ్రు వస్తుంది.చుండ్రు వచ్చిందంటే ఒక పట్టాన వదలదు.

చుండ్రు రాగానే మనం ముందుగా మార్కెట్ లో దొరికే యాంటీ డాండ్రఫ్ ప్రోడక్ట్ ని వాడుతూ ఉంటాం.అవి తాత్కాలికంగా పనిచేస్తాయి.

అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి.అందుకే సహజ పదార్ధాలతో చుండ్రును ఎలా వదిలించుకోవాలో ఈ చిట్కా ద్వారా తెలుసుకుందాం.

Advertisement

ఈ చిట్కాకి అవసరమైన పదార్ధాలు

Bru కాఫీ పొడి బాదం నూనె విటమిన్ E క్యాప్సిల్ ఈ హెయిర్ ప్యాక్ లో ముఖ్యమైన ఇంగ్రిడియాన్ కాఫీ పొడి.కాఫీ పొడి తలపైన మాడుకు రక్త ప్రసరణను బాగా జరిగేలా చేస్తుంది.

దాంతో తలపై చర్మ రంద్రాలు తెరుచుకొని మృతకణాలు తొలగిపోయి చుండ్రు సమస్య తగ్గిపోయుంది.ఇక్కడా నేను ఒక స్పూన్ కాఫీ పొడిని ఉపయోగిస్తున్నాను.

రెండో ఇంగ్రిడియాన్ గా బాదం నూనెను ఉపయోగిస్తున్నాను.బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉండుట వలన జుట్టుకు పోషణను ఇవ్వటమే కాకుండా తలపై చర్మానికి పోషణను అందించి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

అంతేకాక జుట్టు డ్యామేజీని కూడా తగ్గిస్తుంది.బాదం నూనెను బ్యూటీ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఎర్ర జామ పండు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

మూడో ఇంగ్రిడియాన్ గా విటమిన్ E క్యాప్సిల్ ని ఉపయోగిస్తున్నాను.విటమిన్ E క్యాప్సిల్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటుంది.విటమిన్ E క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి.

Advertisement

తలపై చర్మంలో మృత కణాలను తొలగించి చుండ్రు రాకుండా కాపాడటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.విటమిన్ E క్యాప్సిల్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది.

ఈ మూడింటిని బాగా కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత మీరు సాధారణంగా వాడే షాంపూ తో తలస్నానము చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేస్తూ ఉంటే చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.

ఈ రెమిడీ ని క్రమం తప్పఁకుండా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.అలాగే జుట్టు రాలే సమస్య నుండి కూడా బయటపడవచ్చు.

వారానికి రెండు సార్లు చొప్పున నెల రోజుల పాటు ఈ పేస్ట్ ని జుట్టుకు అప్లై చేసి తలస్నానము చేస్తే చుండ్రు తగ్గటాన్ని గమనించి మీరే ఆశ్చర్యపోతారు.

తాజా వార్తలు