గోపీచంద్, బాలయ్య మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్

క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన నెక్స్ట్ మూవీని బాలకృష్ణతో చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ మూవీకి కథ రెడీ అయ్యింది.

ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు.శృతి హసన్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక చాలా కాలం తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య మరోసారి నటించబోతున్నాడు.ఇక రియల్ లైఫ్ సంఘటనలని బేస్ చేసుకొని ఈ కథని గోపీచంద్ సిద్ధం చేసాడని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.గత కొంతకాలంగా వరుస సినిమాలతో తమన్ జోరు చూపిస్తున్నాడు.

Advertisement

గతంలో మాదిరి అన్ని సినిమాలకి ఒకే తరహా మ్యూజిక్ ఇవ్వకుండా వేరియేషన్స్ చూపిస్తూ ఉండటంతో అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి.కనీసం అరడజను పెద్ద సినిమాల వరకు ప్రస్తుతం తమన్ చేతిలో ఉన్నాయంటే అతని స్పీడ్ ఎలా ఉందో అర్ధమవుతుంది.

బాలయ్య, బోయపాటి అఖండ సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే అఖండ టీజర్ ని అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నందమూరి ఫాన్స్ కోరుకునే విధంగా అందించి మెప్పించాడు.

సినిమాకి కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.అఖండకి అందించిన మ్యూజిక్ నచ్చి బాలయ్య గోపీచంద్ మూవీకి కూడా అతనినే తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది.

ఇక క్రాక్ సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందించడంతో అతనిని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు