చివరి సినిమా కోసం స్టార్ హీరో విజయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ( Vijay Dalapathy )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

విజయ్ తమిళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు.

కాగా ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోలలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా ఒకరు.కొద్ది రోజుల క్రితం విడుదలైన భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీల జాబితాలో దళపతి విజయ్ బాలీవుడ్( Bollywood ) పెద్ద స్టార్లను అధిగమించి రెండవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాడట.

అందులో భాగంగానే తాజాగా సెప్టెంబర్ 14న శనివారం తన కొత్త, చివరి సినిమాను ప్రకటించాడు.కాగా ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.దళపతి విజయ్ 69వ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

Advertisement

ఈ సినిమా విజయ్‌ కి చివరి సినిమా అవుతుంది.ఈ చిత్రాన్ని కన్నడ కెవీఎం ప్రొడక్షన్ హౌస్ ( Kannada KVM Production House )నిర్మించనుంది.

ఇదే తన చివరి సినిమా అని కూడా అధికారికంగా ప్రకటించారు కూడా.ఈ చిత్రం విజయ్ అభిమానులకు చాలా ప్రత్యేకమైనది.

ఈ నేపథ్యంలోనే తన చివరి సినిమాకు విజయ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని ఒక వార్త వైరల్ గా మారింది.

కాగా విజయ్ తన 69వ సినిమా కోసం ప్రొడక్షన్ హౌస్ నుండి 275 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోనున్నారని టాక్.అయితే ఇప్పటివరకు ఇండియాలో మరే నటుడూ ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకోలేదని అంటున్నారు.కొన్ని వారాల క్రితం, భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితా విడుదలైంది.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ సెలబ్రిటీల జాబితాలో దళపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు.బాలీవుడ్ బాద్ షారూఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు.సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

సల్మాన్ ఖాన్ కంటే విజయ్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు.మరి ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ మూవీ మేకర్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి మరి.

తాజా వార్తలు