బెంగుళూరు లో ఉగ్రకలకలం

బెంగుళూరు లో ఉగ్రవాదులు ప్రవేశించారా అన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల శ్రీలంక లో వరుస బాంబు పేలుళ్ల తో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత్ లోని పలు నగరాలలో ఉగ్రవాద చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇంటలిజెన్స్ అధికారులు ప్రకటించారు.ఈ క్రమంలో నగరంలోని పలు చోట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా బెంగుళూరు నగరంలో ఉగ్రకలకలం చోటుచేసుకుంది.బెంగుళూరు లోని అత్యంత కీలక ప్రాంతమైన మెజిస్టిక్ మెట్రో స్టేషన్ లో అనుమానిత ఉగ్రవాది సంచరించినట్లు తెలుస్తుంది.

మెటల్ డిటెక్టర్ ల సాయం తో ఆ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో అతడి వద్ద తుపాకీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీనితో అతడిని విచారిస్తుండగా ఆ అనుమానితుడు తప్పించుకున్నట్లు సమాచారం.

Advertisement

అయితే అసలు అతడు ఉగ్రవాదేనా అతని వద్ద ఎందుకు గన్ ఉంది అన్న దానిపై అధికారులకు ఎలాంటి సమాచారం లేదు.అయితే ప్రస్తుతం ఆ అనుమానితుడు కోసం అధికారులు గాలిస్తున్నారు.

ఈ తాజా ఘటన తో బెంగుళూరు లో మరింత భద్రత ను కట్టుదిట్టం చేసే పనిలో పడ్డారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు