రోడ్దు ప్రమాద రూపంలో వెంటాడిన మృత్యువు.. తెగిపడిన తల.. !

వాహనాలను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం మనిషి ప్రాణాలు పోవడానికి ముఖ్యకారణంగా మారుతుంది.

ఇలా నిత్యం తెలిసో, తెలియకో, ఉత్సాహంతో అవగహన లేక డ్రైవింగ్ విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం ఎందరో ప్రాణాలను బలికొంటుంది.

తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా‌లో సంభ‌వించింది.ఆ వివరాలు చూస్తే.

Terrible Road Accident The Head Of A Severed Young Man Guntur, Terrible Road Acc

కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన పఠాన్‌ సాదిక్‌ (18) గుంటూరు రూరల్‌ మండలం లోని వెంగళాయపాలెంలో బంధువుల ఇంట జరిగిన వివాహానికి రెండు రోజల కిందట కారులో వచ్చాడట.నిన్న సాయంత్రం తిరిగి తన స్వగ్రామం వెళ్లుదాం అనుకున్న సమయంలో పెళ్లింటి బంధువులు ఏదో పని చెప్పడంతో దీని కోసం బేగ్‌ ఖాదర్‌ నాగుల్‌ బాషా (15), పఠాన్‌ లాలు (19)లతో కలసి కారులో బయలుదేరాడు.

కాగా ఆ కారును తాను నడపకుండా పఠాన్‌ లాలు అనే యువకుడికి ఇవ్వగా, అతను మితిమీరిన వేగంతో వెళ్లుతూ స్దానికంగా ఉన్న జగ్జీవన్‌రామ్‌ సెంటర్‌లో రోడ్డు పక్కన ఉన్న విగ్రహం దిమ్మెను బలంగా ఢీకొట్టాడు.కాగా ఈ ప్రమాదంలో ఖాదర్‌ నాగుల్‌ బాషా, సాదిక్‌లు అక్కడికక్కడే మరణించగా కారునడుపుతున్న లాలుకు స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

కాగా ఈ ప్రమాదంలో ఓ యువకుడి తలతెగి రోడ్డుపై పడటం దారుణం.దీన్ని బట్టి చూస్తే కారునడపడంలో నిర్లక్ష్యం అర్ధం అవుతుంది.

రైల్వే గేటు పడినా ఆగలే.. బైక్‌ని భుజాన వేసుకొని మరీ దూకేశాడు.. వీడియో చూస్తే!
Advertisement

తాజా వార్తలు