ఈ బ్యూటీ కి తెలుగులో ఆఫర్లు లేవు.. కానీ అక్కడ మాత్రం..

ఒక సారి కొంతమంది నటీనటులకు అందం, అభినయం, నటనా ప్రతిభ, వంటివి మెండుగా ఉన్నప్పటికీ సినిమా అవకాశాలను మాత్రం దక్కించుకోలేక పోతుంటారు.

ఈ క్రమంలో కొందరు ఏకంగా సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టి ఇతర ఉద్యోగాల్లో సెటిల్ అయినటువంటి నటీనటులు కూడా చాలా మంది ఉన్నారు.

కానీ మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక ఇటు సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టి వెళ్లలేక సతమతమవుతుంటారు.అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా ఈ కోవకే చెందుతుంది.

అయితే ఈ అమ్మడు నటించిన మొదటి చిత్రం లో ఈషా రెబ్బ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన "అంతకు ముందు ఆ తర్వాత" చిత్రంలో ఏకంగా హీరోయిన్ పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ చిత్రం పర్వాలేదనిపించడంతో సినిమా అవకాశాలు బాగానే తలుపు తట్టాయి.

ఈ క్రమంలో తన చిత్ర కథల విషయంలో ఈషా రెబ్బ సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయింది.దీనికితోడు అప్పటివరకు హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఏకంగా రెండో హీరోయిన్ మరియు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో నటించడానికి కూడా సిద్ధ పడింది.

Advertisement

దీంతో ఈషా రెబ్బ సినిమా కెరియర్ కొంతమేర చతికిలపడింది.అంతేగాక ఈ క్రమంలో హీరోయిన్ గా అవకాశాలను కోల్పోయింది.

అయితే ఆ మధ్య ప్రముఖ సీరియల్ హీరో మరియు దర్శకుడు ప్రభాకర్ దర్శకత్వం వహించిన "బ్రాండ్ బాబు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దీంతో ఈ అమ్మడు సీనియర్ దాదాపుగా ముగిసి పోయిందనుకున్నారు అందరూ.కానీ వెంటనే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన "అరవింద సమేత" చిత్రంలో సెకండ్ లీడ్ హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం లభించడంతో అడపాదడపా సినిమా అవకాశాలను దక్కించుకుంటోంది.

అయినప్పటికీ ఈ అమ్మడికి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రం హీరోయిన్ గా ఆఫర్లు కరువయ్యాయి.కానీ కన్నడ, మలయాళం, తమిళం, తదితర భాషలలో మాత్రం వరుసగా సినిమా ఆఫర్లు వరిస్తున్నాయి.

దీంతో ఈషా రెబ్బ టాలీవుడ్ సినిమా పరిశ్రమపై ఫోకస్ తగ్గించినట్లు సమాచారం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు