అక్కినేని నాగార్జున మొదటి పెళ్లి ఫోటోలు చూసారా...?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే నటుడు నాగార్జున సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయినప్పటికీ తన కుటుంబం పరపతిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకోసం ప్రయత్నించి బాగానే సక్సెస్ అయ్యాడు.

అయితే మొదట్లో నాగార్జున 1986వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన "విక్రమ్" అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో హీరో నాగార్జున కి సినిమా అవకాశాలు క్రమక్రమంగా బాగానే వరించాయి.

ఆ తర్వాత దాదాపుగా ఐదారు చిత్రాలలో నాగార్జున హీరోగా నటించినప్పటికీ ఆ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.కానీ 1989వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ అనే చిత్రం ద్వారా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను నెలకొల్పాడు నాగార్జున.

దీంతో అప్పటి నుంచి నాగార్జున సినిమా ఇండస్ట్రీలో తిరుగులేకుండా హీరోగా నటిస్తూ టాలీవుడ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే సినీ జీవితం పరంగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున తన వైవాహిక జీవితంలో మాత్రం సమస్యలు ఎదుర్కొన్నాడు.

Advertisement

కాగా నటుడు నాగార్జున 1984వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీ దగ్గుబాటి ని పెళ్లి చేసుకున్నాడు.దీంతో వీరికి 1986వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ హీరో అక్కినేని నాగచైతన్య జన్మించాడు.

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా బాగానే రాణిస్తున్నాడు.

అయితే అక్కినేని నాగార్జున కి మరియు లక్ష్మీ దగ్గుబాటికి మనస్పర్ధలు, విభేదాలు రావడంతో పెళ్లైన 6 సంవత్సరాలకు 1990వ సంవత్సరంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత హీరో నాగార్జున 1992 వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ హీరోయిన్ అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కాగా తాజాగా ఓ అభిమాని అక్కినేని నాగార్జున మొదటి భార్య లక్ష్మి తో పెళ్లి జరుగుతున్న సమయంలో తీసినటువంటి ఫోటోలని సోషల్ మీడియా లో షేర్ చేశాడు.

దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ ప్రస్తుతం నాగార్జునకి 60 సంవత్సరాలు పైబడినప్పటికీ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ బాగానే అలరిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే హీరో నాగార్జున నూతన దర్శకుడు ఆశిషోర్ సోలమన్ దర్శకత్వం వహించిన వైల్డ్ డాగ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.దీంతో ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న బంగార్రాజు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

అలాగే బాలీవుడ్ లో కూడా బ్రహ్మాస్త్ర అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఇటీవలే మరో టాలీవుడ్ నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అలాగే ఈ చిత్రం హర్రర్ బ్యాక్ డ్రాప్ తరహాలో తెరకెక్కబోతోందని కొందరు చర్చించుకుంటున్నారు.

" autoplay>

తాజా వార్తలు