సీనియారిటీ కాదు సిన్సియారిటీ కావాలంటున్న తెలుగుదేశం !!

ప్రజా జీవితంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీకి సంధి దశ అంటూ ఒకటి ఉంటుంది.

ముఖ్యంగా ఎన్నో ఆశలతో పార్టీల్లోకి వచ్చే యువ రక్తాన్ని ప్రోత్సహించి కొత్త రక్తాన్ని, పాత అనుభవాన్ని కలిపి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆయా పార్టీల నాయకుల పై ఉంటుంది.

సాంప్రదాయ కాంగ్రెస్( Congress ) రాజకీయానికి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దూసుకు వచ్చిన నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) పెట్టిన తెలుగుదేశానికి తెలుగు యువత బ్రహ్మరథం పట్టారు.సహజంగా రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలకి కాకుండా కొత్త ఆలోచనలు ఉన్న యువ నాయకులకు , బీసీల నుంచి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వడంతో వందల మంది నాయకులను తయారుచేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది.

ఆ తరువాత కూడా చంద్రబాబు( Chandrababu ) హయాములో కొంతమందికి అవకాశం ఇచ్చినప్పటికీ ఒక దశ దాటిన తర్వాత వారందరూ సీనియర్లుగా మారిపోయి పార్టీ పదవులను అవకాశాలను తమ గుప్పిట పట్టి ఉంచడం మొదలైంది.తమ తమ నియోజకవర్గాలలో కీలకమైన పదవులను అవకాశాలను తమ వర్గానికే ఇప్పించుకుంటూ కొత్త యువ రక్తాన్ని పార్టీలోకి చేరకుండా ఈ సీనియర్లు అడ్డుపడ్డారు అన్నది ఒక విశ్లేషణ.

దాంతోనే తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) మారుతున్న పరిస్థితులను అవపోసన పట్టలేక గత ఎన్నికల్లో దెబ్బతింది అన్నది రాజకీయ పరిశీలకుల మాట.అయితే ఈసారి ఎన్నికలలో సమూల మార్పులకు తెలుగుదేశం తెరతీసినట్లుగా తెలుస్తుంది.

Advertisement

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన చాలామంది కీలక నేతలు ప్రస్తుత తెలుగుదేశం ప్రచారంలో గాని, కీలక సమావేశాల్లో కానీ కనిపించకపోవడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్య పరుస్తున్నది.

తెలుగుదేశం పార్టీ అంటే వెంటనే గుర్తుకు వచ్చే చాలామంది నేతలు తెలుగుదేశం కార్యక్రమాలలో పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం గమనించవచ్చు.అయితే దీని వెనక వ్యూహాత్మకమైన స్ట్రాటజీ ఉన్నదని గత ఎన్నికల్లో వైసీపీ ( YCP )అధికారంలోకి రావడానికి సర్వేలను.ఐపాక్ లాంటి ఎన్నికల వ్యూహకర్తలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే ప్రధాన కారణం అని నమ్ముతున్న టిడిపి( TDP ) ఈసారి తాము కూడా అదే విధానాన్ని అవలంబించాలని బావిస్తుందట .ప్రజల్లో పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ చేయించి ప్రజాధరణ ఉన్న నేతలను మాత్రమే సీనియారిటీకి సంబంధం లేకుండా సిన్సియారిటీని చూసి ఎన్నుకోవాలని నిర్ణయించుకోవడం వల్లే సీనియర్లను తమ తమ నియోజకవర్గాలకు పరిమితం చేశారన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

అంతేకాకుండా యువ గళం పాదయాత్ర( Yuva Galam Padayatra ) ద్వారా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తున్న లోకేష్( Lokesh ) ఈసారి సీట్ల ఎంపికలో కీలకపాత్ర వహిస్తారని ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్న లోకేష్ కార్యకర్తల ప్రత్యక్ష అభిప్రాయాలను క్రోడీకరించి ఆయా నియోజకవర్గాలలో పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులను బేరీజు వేసుకొని అభ్యర్థుల లో లిస్టును తయారు చేస్తారని చంద్రబాబు ఆ లిస్ట్ ను ఫైనల్ చేసి ప్రకటిస్తారంటూ తెలుస్తుంది.దాంతో సీనియర్లు తమకు టిక్కెట్టు వస్తే చాలులే అన్న భావనతో తమ తమ నియోజకవర్గాలకు పరిమితం అయిపోయారని వార్తలు వస్తున్నాయి మరి సీనియారిటీ కన్నా సిన్సియారిటీ పట్టం కట్టాలని చూస్తున్న తెలుగుదేశం దానికి తగ్గ ఫలితం అందుకుంటుందో లేదో చూడాలి.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు