తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 31, శుక్రవారం2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam)

:

సూర్యోదయం: ఉదయం 5.42

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.48

రాహుకాలం: ఉ.10.30 మ12.00

Advertisement

అమృత ఘడియలు: ఉ.10.00 ల10.20

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12

మ.12.28 ల1.12

మేషం:

ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి.సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు.స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.

Advertisement

చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం.నూతనకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.

కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.

మిథునం:

ఈరోజు కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది.పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు.బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కర్కాటకం:

ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.సహనం వహించడం అన్నివిధాలా మేలు.బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది.

అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది.మానసిక ఆందోళనతో ఉంటారు.

కుటుంబంలో మార్పును కోరుకుంటారు.ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.లేదంటే కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.

కన్య:

ఈaరోజు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది.వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు.మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం.

నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

తుల:

ఈరోజు మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు.ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు.దైవదర్శనం చేసుకుంటారు.

స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.కళలందు ఆసక్తి పెరుగుతుంది.

నూతన వస్తు, వస్త్ర ఆభరణాలనుపొందుతారు.

వృశ్చికం:

ఈరోజు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది.అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి.వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు.

చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.

పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు:

ఈరోజు బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.మానసిక ఆందోళన అధికమవుతుంది.అనారోగ్య బాధలను అధిగమిస్తారు.

అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది.స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.

నూతనకార్యాలకు ప్రణాళికలు వేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు

మకరం:

ఈరోజు అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.అశుభవార్తలు వినాల్సి వస్తుంది.ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది.

మనస్తాపానికి గురవుతారు.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.

నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకండి.

కుంభం:

ఈరోజు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు.మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు.

శతృబాధలు తొలగిపోతాయి.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.ఆకస్మిక లాభాలు ఉంటాయి.

కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.

మీనం:

ఈరోజు మనస్సు చంచలంగా ఉంటుంది.బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు.

ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.

మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

తాజా వార్తలు