తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే15, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.45

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.42

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00 ల9.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

ఈరోజు సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి.స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది భాగస్వామి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

వృషభం

Advertisement

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది.బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధిస్తారు.

భూ సంబంధ క్రయ విక్రయాలు లాభిస్తాయి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.

మిథునం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి.కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.సంతాన విద్యా సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతారు.

దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు దూరప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి.చేపట్టిన ప్రతీ పనీ అప్రయత్నంగా పూర్తవుతుంది.ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.

ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

సింహం:

ఈరోజు వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.వ్యాపారపరంగా సొంత ఆలోచన చేసి ఇబ్బంది పడతారు.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన ఋణ ప్రయత్నాలు విఫలం అవుతాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.వృత్తి, ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి.ఇతరుల వ్యవహారాలలో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలుపరచి లాభాలు అందుకుంటారు.దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

తుల:

ఈరోజు మొండి బాకీలు వసూలు కావడం ఆలస్యం అవుతుంది.విలాస వస్తువుల కోసం ధనవ్యయం చేస్తారు.స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

వృత్తి వ్యాపారాలలో ఇతరులతో జాగ్రత్త వహించాలి.ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి.

సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.మిత్రుల నుండి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

మానసికంగా ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ధనుస్సు:

ఈరోజు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.సంతాన వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ఫలించవు.

చిన్ననాటి మిత్రులతో స్వల్పవివాదాలు కలుగుతాయి.ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

మకరం:

ఈరోజు సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి.ఆర్థిక పరమైన సమస్యలు కలుగుతాయి.చేపట్టిన పనులలో అధిక శ్రమకు స్వల్ప ఫలితాన్ని పొందుతారు.

ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.ఋణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉంటాయి.

ధనపరమైన ఒడిదుడుకులు కలుగుతాయి.

కుంభం:

ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు.సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

ఉద్యోగస్తులు నూతన పదవులు పొందుతారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.

మీరంటే గిట్టనివారికి దూరంగా ఉండండి.

మీనం:

ఈరోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.నూతన కార్యక్రమాలు ప్రారంభించి మధ్యలో నిలిపివేస్తారు.

బంధు మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.

తాజా వార్తలు