తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్4, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.49

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: మ.12.05 ల12.20

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

ఈరోజు తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి.

ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.

మిథునం:

ఈరోజు కొత్త పనులు శ్రీకారం చుడతారు.దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సమాజంలో విలువ పెరుగుతుంది.విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి.

వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కర్కాటకం:

ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

సమాజంలో ఆదరణ పెరుగుతుంది.వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

సింహం:

ఈరోజు కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి.ధనపరంగా ఇబ్బందులుంటాయి.ఖర్చులు అదుపు చేయడం మంచిది.

పనులు నిదానంగా పూర్తవుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.

కన్య:

ఈరోజు ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి.గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది.పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.

కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

తుల:

ఈరోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.ఋణ ప్రయత్నాలు కలిసిరావు.దూరపు బంధువులనుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది.

దూర ప్రయాణ సూచనలున్నవి.నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.

ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి.నూతన పెట్టుబడులు కలిసిరావు.

ధనుస్సు:

ఈరోజు దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది.నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి.

శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.

మకరం:

ఈరోజు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు.ఆర్థిక లాభాలు కలుగుతాయి.

ఆలోచనలు కలసి వస్తాయి.నూతన వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు.చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి.నూతన రుణాలు చేయవలసి రావచ్చు.

కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి.వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మీనం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి.కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది.స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.అనారోగ్య సూచనలున్నవి.

వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది.

తాజా వార్తలు