హోరాహోరీ గా జరిగిన ఏపీ ఎన్నికల పోరు ఫలితం నేడు తేలబోతోంది.ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది.
ఈ సమయం కోసమే గత కొద్ది రోజులుగా అన్ని పార్టీల నేతలతో పాటు, జనాల్లో ఉత్కంఠగా ఎదురుచూపులు చూసారు.ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే రకమైన టెన్షన్ వాతావరణం అందరిలోనూ నెలకొంటూ వచ్చింది.
ఈ విధంగా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠ గా ఎదురు చూడడం గతంలో ఎప్పుడు జరగలేదు.ఎందుకంటే ఇప్పుడు వెలువడబోయే ఎన్నికల ఫలితాలు గతం కంటే భిన్నంగా ఉండబోతున్నాయని అనేక ఎగ్జిట్ పోల్స్ తేల్చడమే కారణం.
ఎవరు గెలిచినా బొటాబొటిగా మెజారిటీ వస్తుంది తప్ప, ఏకపక్షంగా విజయం దక్కడం సాధ్యం కాదనే విషయాన్ని అనేక ఎగ్జిట్ పోల్స్ తో తేలింది.దీంతో ఎవరు అధికారం చేపడతారు అనేది ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్నగానే మారింది.
ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) లు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వైసిపి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసింది.దీంతో కూటమి గెలుస్తుందా వైసీపీకి మళ్ళీ జనాలు పట్టడ కడతారా అనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది.ఇప్పుడు ఉన్న ఉత్కంఠ వాతావరణం గతంలో ఎప్పుడు కనిపించలేదు.ఎందుకంటే ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు ప్రతీదీ టెన్షన్ కలిగిస్తూనే ఉంది.ఏ పార్టీ, ఏ నాయకుడు సభలు పెట్టినా జనాలు భారీగానే తరలి రావడం, భారీగా పోలింగ్ జరగడం కూడా కారణం .ఇక అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, మ్యానిఫెస్టో విడుదల వరకు అంత టెన్షన్ వాతావరణమే కనిపించింది.ఎన్నికల పోలింగ్ శాతం పెరగడం తో, ఈసారి జనాలు ఎవరిని అధికార పీఠంపై కూర్చోబెడుతున్నారనేది ఎవరికి అంతుపట్టని విషయంగా మారింది.
ఏపీలో గత రెండు ఎన్నికల్లో ఈ స్థాయిలో టెన్షన్ వాతావరణం కనిపించలేదు.2014లో ముందుగా అందరూ ఊహించినట్లుగానే టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది.2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వస్తుందని అంతా అంచనా వేశారు.ఎన్నికలకు ముందు జగన్( YS Jagan Mohan Reddy ) చేపట్టిన పాదయాత్ర జనాల్లో ఆయనకు మంచి తీసుకురావడం, గత టిడిపి పాలన పై జనాల్లో వ్యతిరేకత పెరగడం ఇవన్నీ వైసిపికి కలిసి వస్తాయని ముందుగానే అంతా అంచనా వేశారు.దానికి తగ్గట్లుగానే ఎన్నికల ఫలితం వెలువడింది.151 సీట్లతో వైసిపికి అధికారం దక్కింది.ఈ ఎన్నికల్లో గతంలో వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని వైసిపి ధీమాగానే ఉన్నా.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఆ పార్టీలోను టెన్షన్ కనిపిస్తోంది.ఎగ్జిట్ పోల్స్ లో ఒక్కో సంస్థ ఒక్కో విధంగా ఫలితాన్ని ప్రకటించడంతో, ఏ సంస్థ సర్వే నిజమో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
పైకి ఎవరికి వారు తమదే అధికారం అనే ధీమాను ప్రదర్శిస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నా, లోలోపల మాత్రం భరించలేనంత టెన్షన్ ఎదుర్కొంటున్నారు.